Viral Video: రియల్ లైఫ్ డిస్నీ ప్రిన్సెస్‌ను మీరెప్పుడైనా చూశారా.? ఇదిగో వీడియో
Viral Video: వన్యప్రాణులతో ఓ బాలిక చేస్తున్న స్నేహం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముళ్ళపంది, అడవి పిల్లి ఆ చిన్నారిని ఫాలో అవుతున్న వీడియో వైరల్‌గా మారింది.
Viral Video: రియల్ లైఫ్ డిస్నీ ప్రిన్సెస్‌ను మీరెప్పుడైనా చూశారా.? ఇదిగో వీడియో
Viral Video: సాధారణంగా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు మనుషులతో ఎంతో ఆప్యాయంగా ఉండటం మనం చూస్తుంటాం. కానీ ఒక చిన్నారి ఏకంగా వన్యప్రాణులతో స్నేహం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాటిపై ఆమె చూపిస్తున్న ప్రేమ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీలంకకు చెందిన ఓ బాలిక వరి పొలాల వెంట నడుచుకుంటూ వెళుతుండగా, ఆమె వెంటే ఒక ముళ్ళపంది, ఒక అడవి పిల్లి ఫాలో అవుతున్నాయి. ఆ చిన్నారి ఏదో చెబుతుంటే అవి కూడా అర్థమైనట్లుగా తలాడిస్తున్న ఈ ముచ్చటైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అసలు వీటికి ఆ బాలికతో ఇంతటి స్నేహం ఎలా ఏర్పడిందంటే.. గతంలో కుక్కల దాడిలో ఆ ముళ్ళపందికి తీవ్ర గాయాలయ్యాయట. ఆ సమయంలో చిన్నారి దాన్ని రక్షించి ప్రాణాలు కాపాడటంతో వాటి మధ్య విడదీయరాని ఫ్రెండ్‌షిప్ ఏర్పడిందని తెలుస్తోంది.
సాధారణంగా మనం కార్టూన్లలో చూసే 'డిస్నీ ప్రిన్సెస్' షోలో యువరాణికి తోడుగా ఎప్పుడూ మూగజీవులు వెన్నంటి ఉంటాయి. అచ్చం అలాగే ఈ చిన్నారి వెంట కూడా వన్యప్రాణులు ఎంతో ప్రేమగా నడుస్తుండటంతో.. నెటిజన్లు ఆ బాలికను 'రియల్ లైఫ్ డిస్నీ ప్రిన్సెస్' అని ముద్దుగా పిలుస్తూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




