Kitchen Hacks: బియ్యం నిల్వ చేసిన డబ్బాలో పురుగులా.? ఇలా చేస్తే మళ్లీ అస్సలు రావు..

Kitchen Hacks: చుగా పురుగులు పడుతున్నాయా? అయితే ఏమాత్రం ఆందోళన చెందకండి. వంటగదిలో ఉండే కొన్ని సహజ సిద్ధమైన వస్తువులతో బియ్యంలో పురుగులు చేరకుండా ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకోండి.

Ravi
By Ravi
Published on: 27 Jun 2026 4:12 PM IST
Kitchen Hacks
X

Kitchen Hacks: బియ్యం నిల్వ చేసిన డబ్బాలో పురుగులా.? ఇలా చేస్తే మళ్లీ అస్సలు రావు..

Kitchen Hacks: ప్రతి ఇంట్లో బియ్యాన్ని నెలల తరబడి నిల్వ ఉంచుకోవడం సర్వసాధారణం. అయితే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు లేదా కాస్త తేమ తగిలినా బియ్యంలో తెల్ల పురుగులు, పెంకు పురుగులు పడుతుంటాయి. ఇలా పురుగులు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేయడం గృహిణులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి ఎలాంటి కెమికల్స్ వాడకుండా, ఇంట్లో ఉండే సహజ వస్తువులతోనే అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

బియ్యం నిల్వ చేసేటప్పుడు ఈ కింది చిట్కాలు పాటిస్తే పురుగుల బెడద ఉండదు:

కర్పూరం: దేవుడి పూజకు వాడే కర్పూరం బిళ్ళలను మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని కాస్త మందంగా ఉండే ఒక నూలు వస్త్రంలో చుట్టి, ఆ మూటను బియ్యం సంచి లేదా డబ్బాలో అడుగు భాగాన వేస్తే కర్పూరం వాసనకు పురుగులు దరిచేరవు.

వేపాకులు: చేదుగా ఉండే వేపాకులకు కీటకాలను పారద్రోలే న్యాచురల్ గుణం ఉంటుంది. వేపాకులను బాగా ఎండబెట్టి పొడిలా చేయాలి. ఆ పొడిని ఒక వస్త్రంలో చిన్న మూటలా కట్టి బియ్యంలో వేయాలి. లేదా కొన్ని ఎండిన వేపాకులను నేరుగా బియ్యంలో వేసినా మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల తెల్ల పురుగులతో పాటు పెంకు పురుగులు కూడా దరిచేరవు.

ఇతర వంటగది దినుసులు: పైన చెప్పినవే కాకుండా.. ఘాటైన వాసన వచ్చే ఇంగువ, బిర్యానీ ఆకులు, లేదా ఎండు మిర్చిని బియ్యం నిల్వ చేసే డబ్బాలో వేసినా పురుగులు పట్టకుండా సులభంగా కాపాడుకోవచ్చు.

ఈ చిన్న చిన్న కిచెన్ చిట్కాలు పాటించడం వల్ల బియ్యం ఎక్కువ కాలం పాటు పురుగు పట్టకుండా, చాలా తాజాగా, సురక్షితంగా ఉంటాయి. తద్వారా మీ శ్రమ, సమయం రెండూ ఆదా అవుతాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story