Rent a Boyfriend: అద్దెకు బాయ్ ఫ్రెండ్..ఎక్కడో కాదు మన దగ్గరే..గంటకు ఎంతంటే..?

Rent a Boyfriend: జపాన్‌లో సూపర్ హిట్ అయిన రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియాలోకి వచ్చింది.

Naresh.k
Published on: 7 Jun 2026 9:07 AM IST
Rent a Boyfriend
X

Rent a Boyfriend: అద్దెకు బాయ్ ఫ్రెండ్..ఎక్కడో కాదు మన దగ్గరే..గంటకు ఎంతంటే..?

Boyfriend Booking: సినిమాల్లో హీరోయిన్ తన తండ్రినో, విలన్నో నమ్మించడానికి ఎవరో ఒకరిని అద్దెకు తెచ్చి ఇతనే నా బాయ్‌ఫ్రెండ్ అని అబద్ధం చెప్పడం చూసుంటారు. కానీ, ఇప్పుడు అది కేవలం సినిమా సీన్ మాత్రమే కాదు.. మన దేశంలో నిజంగానే జరుగుతోంది.

అవును, జపాన్‌లో బాగా సక్సెస్ అయిన రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ కాన్సెప్ట్ ఇప్పుడు సైలెంట్‌గా ఇండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇషా భల్లా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తాను స్వయంగా ఒక వెబ్‌సైట్ ద్వారా బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు బుక్ చేసుకున్నానంటూ ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇషా భల్లా షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఆమె కో-పార్ట్‌నర్ అనే వెబ్‌సైట్ నుండి ఒక బాయ్‌ఫ్రెండ్‌ను బుక్ చేసుకుంది. ఇద్దరూ ఒకచోట కలుసుకుని, అక్కడి నుండి షాపింగ్ మాల్‌కు వెళ్లారు. షాపింగ్‌లో ఆ అద్దె బాయ్‌ఫ్రెండ్ ఆమెకు ఎంతో సహాయం చేశాడు. ఆమె కొన్న సామాన్ల బ్యాగులన్నీ ఓపికగా మోశాడు. ఇషా తన పాత లవర్ గురించి చెప్తూ కాస్త ఎమోషనల్ అయినప్పుడు..

అతను ఎంతో ఓపికగా విన్నాడు, అంతేకాదు ఆమె బాధను మర్చిపోయేలా చేయడానికి, నవ్వించడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. సమయం అయిపోయాక, మాట్లాడిన ప్రకారం డబ్బులు తీసుకుని అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు. నిజానికి ఇదొక ప్రమోషనల్ వీడియోనే అయినప్పటికీ, ఇలాంటి సర్వీస్ ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చేసిందనే నిజాన్ని ఈ వీడియో బయటపెట్టింది.

ఈ వెబ్‌సైట్‌లో బాయ్‌ఫ్రెండ్‌ను బుక్ చేసుకోవడం చాలా ఈజీ అని ఇషా డీటెయిల్స్‌తో సహా వివరించింది.మొదట సదరు వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి.అక్కడ రకరకాల కేటగిరీలు ఉంటాయి.

కేవలం టైంపాస్ ముచ్చట్ల కోసం, స్నేహితులతో గడపడానికి, క్లబ్బింగ్‌కు వెళ్లడానికి, సినిమా చూడటానికి, షాపింగ్ హెల్ప్ కోసం, ట్రావెలింగ్ లేదా ఇంట్లో పనుల సహాయం కోసం.. ఇలా మీ అవసరాన్ని బట్టి పార్ట్‌నర్‌ను ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకునే సర్వీస్‌ను బట్టి గంటకు లేదా రోజుకు రూ. 1,000 నుండి రూ. 1,500 వరకు చార్జ్ చేస్తారు.

ఈ వీడియో వైరల్ కావడమే ఆలస్యం.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కామెడీ చేస్తుంటే, మరికొందరు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. రేపు పొద్దున ఆ అద్దె బాయ్‌ఫ్రెండ్‌తో కాస్త క్లోజ్‌గా దిగిన ఫోటోలను చూపిస్తూ, అతను బ్లాక్‌మెయిల్ చేస్తే పరిస్థితి ఏంటి? అమ్మాయిల సేఫ్టీకి గ్యారెంటీ ఏంటి?

అని కొందరు ప్రాక్టికల్ ప్రశ్నలు వేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మన దేశంలో అబ్బాయిలు ఆటోల్లాంటి వాళ్ళు.. ఒక్కరిని పిలిస్తే వందమంది వస్తారు. దానికి మళ్ళీ గంటకు వెయ్యి రూపాయలు ఇచ్చి అద్దెకు తెచ్చుకోవాలా? అంటూ నవ్వుకుంటున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story