Viral Video : షాప్ ఓపెనింగ్‌లో హ్యూమనాయిడ్ రోబో హంగామా.. పూజ, రిబ్బన్ కటింగ్.. ఆపై అదిరిపోయే డాన్స్
Viral Video : సాధారణంగా ఏదైనా కొత్త షాప్ ఓపెనింగ్ ఉందంటే షాప్ ఓనర్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఎవరైనా సెలబ్రిటీలు వచ్చి రిబ్బన్ కట్ చేయడం మనం చూస్తుంటాం.
Humanoid Robot
Viral Video : సాధారణంగా ఏదైనా కొత్త షాప్ ఓపెనింగ్ ఉందంటే షాప్ ఓనర్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఎవరైనా సెలబ్రిటీలు వచ్చి రిబ్బన్ కట్ చేయడం మనం చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో జరిగిన ఒక సాండ్‌విచ్ షాప్ ఓపెనింగ్ మాత్రం టోటల్‌గా డిఫరెంట్‌గా జరిగింది. ఏకంగా ఒక హ్యూమనాయిడ్ రోబోనే ఈ ఈవెంట్‌కు మెయిన్ అట్రాక్షన్‌గా నిలిచింది. ట్రెడిషనల్ పూజలో పాల్గొనడం దగ్గర నుంచి, రిబ్బన్ కట్ చేయడం, చివరికి క్రౌడ్ ముందు విపరీతంగా డాన్స్ చేయడం వరకు రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ట్రెడిషనల్ పూజలో రోబో.. జనాలు ఫుల్ షాక్
ఇండోర్‌కు చెందిన ‘విద్యుత్ ఇన్నోవేషన్’ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసిన ఈ హ్యూమనాయిడ్ రోబోను ఈ ఓపెనింగ్ ఈవెంట్ కోసం స్పెషల్‌గా తీసుకొచ్చారు. రోబోకు మన సంప్రదాయం ప్రకారం కాషాయ శాలువా కప్పి రెడ్ కార్పెట్‌పై నిలబెట్టారు. షాప్ ముందు జనాలు గ్యాదర్ అయి ఈ వింత అతిథిని ఆసక్తిగా గమనిస్తూ తమ ఫోన్లలో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఈ రోబో ఓపెనింగ్‌కు ముందు జరిగిన ట్రెడిషనల్ పూజా కార్యక్రమాల్లో పూజారులతో కలిసి పాల్గొంది. ఆ తర్వాత రిబ్బన్ కట్ చేసి షాప్‌ను అధికారికంగా ప్రారంభించింది. చుట్టూ ఉన్న జనాలకు చేతులు ఊపుతూ హెల్లో అని విష్ చేస్తూ గ్రాండ్‌గా ఇంటరాక్ట్ అయింది.
వేదికపై రోబో డాన్స్ పెర్ఫార్మెన్స్.. ఫోన్లలో బంధించిన జనాలు
రిబ్బన్ కటింగ్ పూర్తయ్యాక అసలైన వినోదం మొదలైంది. ఈ రోబో ఒక్కసారిగా ట్రెండీ మ్యూజిక్‌కు అనుగుణంగా డాన్స్ మూవ్స్ వేయడం స్టార్ట్ చేసింది. రోబోట్ చేసిన ఫన్నీ అండ్ ఎనర్జిటిక్ డాన్స్ చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్, జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరూ తమ స్మార్ట్‌ఫోన్లు బయటకు తీసి ఈ రోబో డాన్స్ పెర్ఫార్మెన్స్‌ను వీడియోలు తీస్తూ తెగ ఎంజాయ్ చేశారు.
సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల కామెంట్స్ రచ్చ
'నిలయ్' అనే ఎక్స్ (ట్విట్టర్) యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వినూత్నమైన ఆలోచనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ రోబో నాకంటే చాలా బెటర్‌గా డాన్స్ చేస్తోందని సరదాగా కామెంట్లు పెట్టారు. మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆటోమేషన్ ఇలాగే పెరిగిపోతే భవిష్యత్తులో రెస్టారెంట్లలో వెయిటర్లు, చెఫ్‌ల జాబ్స్ అన్నీ ఈ రోబోలే తినేస్తాయేమో అని పోస్ట్‌లు చేశారు. ఇంకొందరు చైనాతో పోలుస్తూ అక్కడ రోబోటిక్ టెక్నాలజీని హైటెక్ పనులకు వాడుతుంటే, మన దగ్గర మాత్రం ఇలాంటి షాప్ ఓపెనింగ్‌లలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాడుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా, ఒక సాండ్‌విచ్ షాప్ ఓపెనింగ్ కోసం ట్రెడిషనల్ విధానానికి ఇలాంటి మోడర్న్ టెక్నాలజీని మిక్స్ చేసి చేసిన ప్రయోగం మాత్రం ఇంటర్నెట్‌లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించుకుంది.
Inauguration of sandwich shop, Ujjain Madhya Pradesh pic.twitter.com/D5658yA30s
— NiLAY 📸 (@NilayPhotos) August 23, 2026




