Viral: అర్ధరాత్రి ఎస్‌బీఐ నుంచి వచ్చిన మెసేజ్‌ చూసి అవాక్కయిన కస్టమర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

Viral: అర్ధరాత్రి సమయంలో ఎస్‌బీఐ నుంచి వచ్చిన మెసేజ్ చూసి అవాక్కయిన కస్టమర్ విచిత్రమైన ప్రశ్నలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Ravi
By Ravi
Published on: 28 Sept 2026 7:20 PM IST
Viral
X

Viral: అర్ధరాత్రి ఎస్‌బీఐ నుంచి వచ్చిన మెసేజ్‌ చూసి అవాక్కయిన కస్టమర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

Viral: కోట్ల సంఖ్యలో ఖాతాదారులను కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలను అందిస్తోంది. అయితే ఇటీవల ఒడిశాలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బ్యాంకు నుంచి వచ్చిన ఒక మెసేజ్ కారణంగా సాధారణ కస్టమర్ పడిన పాట్లు నవ్వులు పూయిస్తున్నాయి. ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

వాస్తవానికి సోమవారం నుండి మూడు రోజుల పాటు బ్యాంకుల బంద్ కానున్నాయి. కానీ.! ఆ సమ్మె ప్రస్తుతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ బంద్ నేపధ్యంలో ఆదివారం రోజు కూడా బ్యాంకులు తెరిచి ఉంటాయని ఎస్‌బీఐ తన కస్టమర్లకు వరుసగా మెసేజ్‌లు పంపింది. తమ ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో బ్యాంకు అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూసి ఒక సామాన్య కస్టమర్ తీవ్రంగా అప్రమత్తమయ్యాడు.

దయచేసి మీ సమీపంలోని బ్రాంచ్‌ను సందర్శించండి అంటూ అర్ధరాత్రి సమయంలో వివిధ భాషలలో ఎస్‌బీఐ ఎస్‌ఎంఎస్‌లు పంపింది. ఆ మెసేజ్ చూసిన ఆ కస్టమర్ ఒక్కసారిగా కంగారుపడ్డాడు. తెల్లవారగానే ఉదయాన్నే హుటాహుటిన బ్యాంకు శాఖకు చేరుకున్నాడు. బ్యాంకు అధికారుల ముందుకు వెళ్లి తాను ఎవరికీ ఎలాంటి తప్పు చేయలేదని, అయినా తనను ఎందుకు రమ్మన్నారో చెప్పాలని అమాయకంగా నిలదీశాడు.

బ్యాంకుకు రమ్మన్నారు కానీ ఎందుకు పిలిచారో మాత్రం మెసేజ్‌లో చెప్పలేదని ఆ వ్యక్తి ప్రశ్నించిన తీరు అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచింది. సెలవు దినాల్లో కూడా సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పడానికి బ్యాంకు పంపిన సాధారణ సందేశాన్ని ఆ కస్టమర్ తప్పుగా అర్థం చేసుకున్నాడని అధికారులు గ్రహించారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సరదా ఘటనను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.