Viral: అరే ఏంట్రా ఇది.! బైక్‌కు ఏకంగా రూ. 5 లక్షలకుపైగా చలాన్లు.. ఎక్కడో తెలుసా.?

Viral: ఒకే బైక్‌పై ఏకంగా 63 పెండింగ్ చలాన్లు, వాటి మొత్తం చూస్తే ఏకంగా రూ. 5 లక్షలకు పైగా.. ఈ విస్తుపోయే ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో వెలుగుచూసింది.

Ravi
By Ravi
Published on: 5 July 2026 3:01 PM IST
Viral
X

Viral: అరే ఏంట్రా ఇది.! బైక్‌కు ఏకంగా రూ. 5 లక్షలకుపైగా చలాన్లు.. ఎక్కడో తెలుసా.?

Viral: సాధారణంగా మనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వందల్లో లేదా మహా అయితే వేలల్లో చలాన్లు పడుతుంటాయి. ఆ చలాన్ల మొత్తాన్ని చూసే చాలామంది భయపడిపోయి వెంటనే కట్టేస్తుంటారు. కానీ, ఒకే బైక్‌పై ఏకంగా 63 పెండింగ్ చలాన్లు ఉండటం, ఆ చలాన్ల మొత్తం ఏకంగా ఐదున్నర లక్షల రూపాయలకు పైగా ఉండటం మీరు ఎప్పుడైనా చూశారా? ఈ విస్తుపోయే ఘటన హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో తాజాగా వెలుగు చూసింది.

గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టెమిస్-అంబేద్కర్ చౌక్ వద్ద రెగ్యులర్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ చెకింగ్ సమయంలో ఒక బైకర్‌ను ఆపి డాక్యుమెంట్స్ చూపించమని అడిగారు. కానీ ఆ వ్యక్తి తన వద్ద ఎలాంటి సరైన పత్రాలు లేవని చెప్పడంతో, వెంటనే పోలీసులు ఆ బైక్ నంబర్ ఆధారంగా సిస్టమ్‌లో చెక్ చేశారు. ఆ బైక్‌పై ఉన్న చలాన్ల లిస్ట్ చూసి పోలీసులు అవాక్కయ్యారు.

ఆ బైక్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, వాలిడ్ ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం లాంటి వివిధ రకాల ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు గానూ ఏకంగా 63 చలాన్లు విధించారని తేలింది. వీటన్నింటికి సంబంధించిన జరిమానా మొత్తం ఏకంగా రూ. 5,45,500 ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ మొత్తంలో పెండింగ్ చలాన్లు ఉన్నందుకు గానూ మోటారు వాహనాల చట్టం ప్రకారం వెంటనే ఆ బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ వార్త ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story