కోకాకోలా కాదు ఇది.. ఒకప్పుడు 'కొకైన్' కోలా.. ఈ స్టోరీ విన్నారంటే స్టన్ అవ్వాల్సిందే

Coca-Cola: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ కూల్ డ్రింక్స్‌లో ఒకటైన కోకాకోలాలో ఒకప్పుడు 'కొకైన్' ఉండేదని మీకు తెలుసా?

Ravi
By Ravi
Published on: 8 July 2026 8:11 AM IST
Coca-Cola
X

కోకాకోలా కాదు ఇది.. ఒకప్పుడు 'కొకైన్' కోలా.. ఈ స్టోరీ విన్నారంటే స్టన్ అవ్వాల్సిందే

Coca-Cola: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ కూల్ డ్రింక్స్‌లో ఒకటైన కోకాకోలాలో ఒకప్పుడు నిజంగానే కొకైన్ ఉండేదని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం.

1886 వ సంవత్సరంలో జాన్ పెంబర్టన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ కోకాకోలా డ్రింక్‌ను తయారు చేశాడు. అయితే, ప్రారంభంలో దీనిని ఒక కూల్ డ్రింక్‌లా కాకుండా.. అలసట, తలనొప్పిని పోగొట్టే ఒక టానిక్‌గా ప్రజల్లోకి విస్తృతంగా ప్రమోట్ చేశారు. ఈ డ్రింక్ తయారీలో ప్రధానంగా 'కోకా లీఫ్'ను కలపడం వల్ల, సహజంగానే ఆ డ్రింక్‌లో చాలా చిన్న మొత్తంలో కొకైన్ శాతం ఉండేది.

అయితే, కాలక్రమేణా ప్రజల్లో దీనిపై భయాందోళనలు మొదలయ్యాయి. 1903వ సంవత్సరం నాటికి ఈ కొకైన్ డ్రగ్ వాడటం వల్ల ఆరోగ్యపరంగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న ఆందోళనలు తీవ్రంగా మొదలుకావడంతో, కోకాకోలా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి డ్రింక్ తయారీలో కొకైన్‌ను పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో కెఫిన్, షుగర్‌తో దానిని రీప్లేస్ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు అదే ఫార్ములాతో కోకాకోలా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story