Viral Video: మరీ ఇంత నిర్లక్ష్యమా.? బస్సు డ్రైవ్ చేస్తూ రీల్స్ చూస్తున్న డ్రైవర్.. వీడియో వైరల్.!

Viral Video: లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ బస్సు డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన షాకింగ్ వీడియో నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది. గంటకు 100 కి.మీ. వేగంతో బస్సు నడుపుతూ డ్రైవర్ చేసిన నిర్వాకం గురించి ఇక్కడ తెలుసుకోండి.

Ravi
By Ravi
Published on: 7 July 2026 10:23 AM IST
Viral Video
X

Viral Video: మరీ ఇంత నిర్లక్ష్యమా.? బస్సు డ్రైవ్ చేస్తూ రీల్స్ చూస్తున్న డ్రైవర్.. వీడియో వైరల్.!

Viral Video: దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది ప్రజలు రైళ్లు లేదా బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. తమను సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తాడన్న నమ్మకంతో ప్రయాణికులు నిశ్చింతగా నిద్రపోతుంటారు. కానీ, కొందరు డ్రైవర్లు మాత్రం తమ బాధ్యతను మరచిపోయి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ బస్సు డ్రైవర్ చేసిన అత్యంత నిర్లక్ష్యపూరితమైన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ బస్సు డ్రైవర్ గంటకు 100 కిలోమీటర్ల అత్యంత వేగంతో బస్సును నడుపుతున్నాడు. అయితే డ్రైవింగ్‌పై పూర్తి ఏకాగ్రత పెట్టాల్సిన ఆ డ్రైవర్, ఏమాత్రం బాధ్యత లేకుండా స్టీరింగ్ పట్టుకుని తన మొబైల్ ఫోన్‌లో దర్జాగా రీల్స్ చూస్తూ కనిపించాడు. బస్సులోని ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా విపరీతంగా వైరల్ అవుతోంది.

వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు బస్సు ఏమాత్రం అదుపుతప్పినా ఎంత ఘోర ప్రమాదం జరుగుతుందని, అమాయక ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసిన ఆ బాధ్యతారాహిత్య డ్రైవర్ లైసెన్స్‌ను వెంటనే క్యాన్సిల్ చేయాలని, అలాగే అతడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story