Tandoori Roti: ఈ వీడియో చూస్తే జీవితంలో ఎవడు తందూరి రోటి తినడు భయ్యా..!

Tandoori Roti: హోటళ్లు, డాబాల్లో మనం ఎంతో ఇష్టంగా తినే తందూరి రొట్టెలు ఎంతవరకు సురక్షితం?

Naresh.k
Updated on: 13 Jun 2026 8:25 AM IST
Tandoori Roti
X

Tandoori Roti: ఈ వీడియో చూస్తే జీవితంలో ఎవడు తందూరి రోటి తినడు భయ్యా..!

Hotel Staff: హోటళ్లు, రోడ్‌సైడ్ డాబాల నుండి వచ్చే వేడివేడి తందూరి రోటీలు, బట్టర్ నాన్‌ల సువాసన చూస్తేనే ఎవరికైనా నోరూరుతుంది. వారాంతాల్లో ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లినా.. ఫ్రెండ్స్‌తో కలిసి డాబాలకు వెళ్లినా చాలామంది మెనూలో మొదటి ఛాయిస్ తందూరి రొట్టెలే. అయితే, మనం ఎంతో ఇష్టంగా తినే ఈ బయటి ఆహారం ఎంతవరకు పరిశుభ్రమైన వాతావరణంలో తయారవుతోంది? అసలు మనం తింటున్నది స్వచ్ఛమైన ఆహారమేనా? అనే అనుమానాలకు బలంచేకూరుస్తూ సోషల్ మీడియాలో ఒక జుగుప్సాకరమైన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఒక హోటల్ వంటగదిలో కస్టమర్ల కోసం తందూరి రొట్టెల పిండిని తయారుచేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. అయితే, అక్కడ పిండిని చేతులతో కాకుండా.. ఏకంగా కాళ్లతో తొక్కుతూ ఒక మహిళా సిబ్బంది కనిపించిన తీరు నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. సదరు మహిళ పెద్ద మొత్తంలో ఉన్న మైదా పిండి ముద్దపై ఏకంగా చెప్పులు ధరించిన తన కాలిని పెట్టి తొక్కుతూ వికృత చేష్టలకు పాల్పడింది. హోటల్ యాజమాన్యం నిఘా లోపమో లేక సిబ్బంది నిర్లక్ష్యమో కానీ, కస్టమర్ల ఆరోగ్యంతో ఇంత దారుణంగా చెలగాటమాడుతున్న దృశ్యాలు చూసి ఆహార ప్రియులు తీవ్ర అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.

మనం హోటళ్లకు వెళ్లి హ్యాండ్ మేడ్ అని నమ్మి ఆర్డర్ ఇస్తుంటే.. తెరవెనుక ఇవి ఫుట్ మేడ్‌గా మారుతున్నాయి అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆహార పదార్థాల తయారీలో ఇలాంటి వికృత చేష్టలు వెలుగుచూడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ తందూరి రొట్టెలు చేసేటప్పుడు పిండిపై ఉమ్మి వేయడం, కాళ్లతో తొక్కడం వంటి దారుణాలు దేశంలోని పలు నగరాల్లో వెలుగుచూశాయి. ఆయా సమయాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి దాడులు నిర్వహించడం, సదరు హోటళ్లను సీజ్ చేసి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది.

తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఎక్కడిది అనేదానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ.. ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు దీనిపై సుమోటోగా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అపరిశుభ్ర కట్టడాల తయారీదారులను, ఆ హోటల్‌ను వెంటనే గుర్తించి కఠినమైన శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి హోటల్ కిచెన్‌లోనూ సీసీటీవీ కెమెరాలను తప్పనిసరి చేయాలని, అప్పుడే వినియోగదారుల ప్రాణాలతో యథేచ్ఛగా ఆడుకునే ఇలాంటి సిబ్బందికి అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బయటి ఫుడ్ తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని, నమ్మకమైన మరియు ఓపెన్ కిచెన్ ఉన్న హోటళ్లను ఎంచుకోవడమే ప్రస్తుతానికి సురక్షితమని ఈ వీడియో మరోసారి నిరూపించింది.




Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story