Lady Constable: స్టేషన్‌నే బెడ్‌రూమ్‌గా మార్చేసిన పోలీస్ జంట!

Lady Constable: విధుల్లో ఉండి కూడా ఆఫీస్ రూమ్‌నే రొమాన్స్ అడ్డాగా మార్చేసింది ఓ పోలీస్ జంట.

Naresh.k
Published on: 26 Jun 2026 11:25 AM IST
Lady Constable
X

Lady Constable: స్టేషన్‌నే బెడ్‌రూమ్‌గా మార్చేసిన పోలీస్ జంట!

Police romance video viral: పోలీసులు అంటే సమాజానికి రక్షకులు.. శాంతిభద్రతలను కాపాడే ఆదర్శమూర్తులు. సమాజంలో ఎక్కడైనా తప్పు జరిగితే అడ్డుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. కానీ, ఇక్కడ కథ అడ్డం తిరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ పోలీస్ జంట.. తాము ఉన్నది పవిత్రమైన పోలీస్ స్టేషన్‌లో అనే విషయాన్ని కూడా మర్చిపోయింది. విధుల్లో ఉండి కూడా ఆఫీసు రూమ్‌నే రొమాన్స్ అడ్డాగా మార్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీటీవీ జువల్స్ సోషల్ మీడియాలో దావానలంలా వైరల్ అవుతున్నాయి.

ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందనేది స్పష్టంగా తెలియకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక పోలీస్ క్లర్క్ ఆఫీస్ టైమ్‌లో కుర్చీలో కూర్చుని తన పని తాను చేసుకుంటున్నాడు. అంతలోనే అక్కడికి ఒక మహిళా కానిస్టేబుల్ ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది.. లోపల ఎవరూ లేరనుకున్నారో ఏమో కానీ, ఇద్దరి మధ్య రొమాన్స్ మొదలైపోయింది.

సదరు క్లర్క్ సీట్లో కూర్చుని ఉండగానే ఆమె అతనిపై వాలిపోయింది. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయింది. అంతటితో ఆగకుండా, కొద్దిసేపటి తర్వాత ఆఫీసులో ఉన్న సీసీటీవీ కెమెరాకు చిక్కకుండా ఇద్దరూ రూమ్ లోని ఒక చీకటి మూలకు వెళ్లి కూర్చున్నారు. వీడియోలో వీరు సివిల్ డ్రెస్సుల్లోనే ఉన్నప్పటికీ, విధుల్లో ఉన్న సమయంలోనే ఈ నిర్వాకానికి తెరలేపినట్లు తెలుస్తోంది.

ఆఫీసు మూలల్లో ఏం చేసినా ఎవరికీ తెలియదనుకున్నారు ఆ జంట. కానీ, పైనున్న కెమెరా కన్ను వారి బాగోతాన్ని మొత్తం రికార్డ్ చేసింది. ఈ రొమాన్స్ వీడియో కాస్తా కాంప్లిమెంటరీగా బయటకు లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన చోట ఇదేం పాడుపని? అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో ఎస్పీ తీవ్రంగా స్పందించారు. పోలీసు శాఖ క్రమశిక్షణకు, యూనిఫాం గౌరవానికి భంగం కలిగించారనే నెపంతో సదరు క్లర్క్, మహిళా కానిస్టేబుల్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఎవరైనా తప్పు చేస్తే స్టేషన్‌కు తెచ్చి బుద్ధి చెప్పాల్సిన పోలీసులే.. స్టేషన్ లోపల ఇలాంటి పనులకు ఒడిగట్టడంపై శాఖ పరంగానే కాకుండా పబ్లిక్ నుండి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story