Girls fight: బాయ్‌ఫ్రెండ్ కోసం రోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు!

Girls fight: బాయ్‌ఫ్రెండ్ విషయంలో ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై తీవ్రంగా దాడి చేసుకున్న వీడియో వైరల్.

Naresh.k
Published on: 15 Aug 2026 11:54 AM IST
Girls fight
X

Girls fight: బాయ్‌ఫ్రెండ్ కోసం రోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు!

Girls fight: సోషల్ మీడియా తెరిస్తే చాలు ఎక్కడో ఒకచోట వింత విచిత్రమైన గొడవలు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూసి నెటిజన్ల నోళ్లు వెళ్లబెడుతున్నారు. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఇద్దరు యువతులు పరస్పరం 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించడమే దీనికి కారణం. సమాచారం ప్రకారం.. ఒకే అబ్బాయి విషయంలో ఏర్పడిన విభేదాలే ఈ దారుణమైన భౌతిక దాడికి దారితీశాయి. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ, చెంపలు వాయించుకుంటూ రోడ్డుపైనే తీవ్రంగా కొట్టుకున్నారు.

ఒకే వ్యక్తిని ప్రేమించడం లేదా బాయ్‌ఫ్రెండ్ విషయమై ఏర్పడిన విభేదాలు. చుట్టుపక్కల ఉన్నవారు వద్దు అని వారిస్తున్నా.. వినకుండా విచక్షణ మరచి ప్రవర్తించారు. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఒకరినొకరు 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఫైటింగ్ రీల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్ది నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్, వేలాది కామెంట్లతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక అబ్బాయి కోసం పబ్లిక్ స్థలంలో ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు. నేటి యువతలో సహనం ఎంతగా తగ్గిందో అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం అని కొందరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 15 సెకన్లలో ఇన్ని దెబ్బలా అసలు ఇది ఫైటింగా లేక రికార్డు కోసమా? అని మరికొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. పబ్లిక్ స్థలంలో చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పట్టించుకోకుండా వీరు చేసిన ఈ రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story