Viral Video: కోడలంటే ఈమెలా ఉండాలి.. గాయని కాజల్ చౌధరీ సాహసయాత్రకు గ్రామాలు జేజేలు!

Viral Video: ఆధునిక శ్రవణ కుమారుడు! హరియాణాకు చెందిన ప్రముఖ జానపద గాయని కాజల్ చౌధరీ తన 90 ఏళ్ల అత్తగారి చిరకాల కోరికను తీర్చడం కోసం ప్లాస్టిక్ టబ్బులో ఎత్తుకుని ఏకంగా 260 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

Arun Chilukuri
Published on: 4 Jun 2026 2:28 PM IST
Viral Video
X

Viral Video: కోడలంటే ఈమెలా ఉండాలి.. గాయని కాజల్ చౌధరీ సాహసయాత్రకు గ్రామాలు జేజేలు!

Haryana singer Kajal Choudhary: కలియుగంలో బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయని బాధపడే ఈ రోజుల్లో.. అత్తగారి చిరకాల వాంఛను తీర్చేందుకు హరియాణాకు చెందిన ప్రముఖ జానపద గాయని కాజల్‌ చౌధరీ చేసిన సాహసయాత్ర అందరి కళ్లను చెమరుస్తోంది. వృద్ధాప్యం కారణంగా కనీసం నడవలేని స్థితిలో ఉన్న తన 90 ఏళ్ల అత్తమ్మ చంద్రీదేవిని ఒక ప్లాస్టిక్‌ టబ్బులో కూర్చోబెట్టుకుని, చేతులతో మోస్తూ ఏకంగా 260 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు ఉపక్రమించి ఆధునిక 'శ్రవణ కుమారి'గా నిలిచారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, బృందావన్‌ సహా మరికొన్ని పవిత్ర వైష్ణవ క్షేత్రాలను సందర్శిస్తూ భక్తులు చేసే అత్యంత పవిత్రమైన యాత్రే ఈ ‘బ్రిజ్‌ పరిక్రమ’. ఈ ఆధ్యాత్మిక యాత్ర దాదాపు 84 కోసుల (ఒక్కో కోసు 3.2 కి.మీ చొప్పున సుమారు 260 కిలోమీటర్ల) దూరం ఉంటుంది. సాధారణంగా ఈ పాదయాత్రను కాలినడకన పూర్తిచేయడానికి దాదాపు 40 రోజుల సమయం పడుతుంది.

శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథుర మొదలుకుని హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో వ్యాపించి ఉన్న కృష్ణుడి బాల్య, యవ్వన లీలల పవిత్ర ప్రదేశాలను భక్తులు ఈ యాత్రలో దర్శించుకుంటారు.

"మా అత్తయ్య నన్ను ఎప్పుడూ ఒక కోడలిలా చూడలేదు. నన్ను తన సొంత బిడ్డలా ఆదరించి, గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న ఆమె పవిత్ర కృష్ణ క్షేత్రాలను దర్శించుకోవాలని ఆశపడింది. ఆమె రుణం తీర్చుకోవడం ఒక బిడ్డగా నా కనీస ధర్మం."

తన సుకుమారమైన గాత్రాన్ని పక్కన పెట్టి, భుజాలపై అంతటి బరువును మోస్తూ కాజల్ సాగిస్తున్న ఈ పాదయాత్ర దారిపొడవునా ఉన్న ప్రజలను కదలిస్తోంది. యాత్ర సాగుతున్న క్రమంలో హరియాణా, యూపీలోని పలు గ్రామాల్లో స్థానిక ప్రజలు, భక్తులు కాజల్ చౌధరీ మాతృభక్తికి ఫిదా అవుతూ ఆమెకు, వృద్ధురాలಿಗೆ పూలమాలలు, హారతులతో బ్రహ్మరథం పడుతున్నారు. ఈ అపూర్వ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సైతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story