Viral News: భార్య వేధింపులు తట్టుకోలేక కలెక్టర్‌కు వింత లేఖ.. 'నన్ను కారుణ్య మరణానికి అనుమతించండి'!
Viral News: భార్య, అత్తల వేధింపులు తట్టుకోలేక కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ సూరత్‌కు చెందిన ఒక వ్యక్తి కలెక్టర్‌కు లేఖ రాశాడు.
Viral News: భార్య వేధింపులు తట్టుకోలేక కలెక్టర్‌కు వింత లేఖ.. 'నన్ను కారుణ్య మరణానికి అనుమతించండి'!
Viral News: భార్య వేధింపులు తట్టుకోలేక, మానసిక క్షోభ భరించలేక ఓ వ్యక్తి కలెక్టర్‌కు రాసిన లేఖ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనను కారుణ్య మరణానికి (Euthanasia) అనుమతించాలంటూ సదరు భర్త జిల్లా అధికారులను వేడుకున్నాడు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
బాధిత వ్యక్తి వివరాల్లోకి వెళితే.. సూరత్‌కు చెందిన కిరిట్ పటేల్ అనే వ్యక్తికి 2024లో స్థానికంగా ఉండే ఒక మహిళతో వివాహం జరిగింది. విశేషం ఏంటంటే.. వీరిద్దరికీ ఇదివరకే రెండేసి పెళ్లిళ్లు కాగా, ఇది మూడో వివాహం. అయితే పెళ్లయిన కొద్దిరోజుల నుంచే కిరిట్ పటేల్‌కు భార్య, అత్తల రూపంలో కష్టాలు మొదలయ్యాయి. నిరంతరం డబ్బు కోసం డిమాండ్ చేస్తూ వారు తనను తీవ్ర మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తున్నారని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను తన భార్య దుర్వినియోగం చేస్తోందని కిరిట్ పటేల్ ఆరోపించారు. తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని కలెక్టర్‌కు సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు ఆమె పెళ్లి చేసుకుని వదిలేసిన ఇద్దరు వ్యక్తులను కూడా ఇదే తరహాలో వేధించి, వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిందని ఆయన వెల్లడించారు. ఈ వేధింపులపై తాను స్థానిక పోలీసులను ఆశ్రయించినప్పటికీ, వారు తన ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన కిరిట్ పటేల్.. ఇక ఈ క్షోభను అనుభవించలేక కారుణ్య మరణమే శరణ్యమని భావించి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. మన దేశంలో గృహ హింస ఎదుర్కొంటున్న పురుషులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ లభించడం లేదని ఆయన ఆ లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ వింత కారుణ్య మరణ అభ్యర్థనపై సూరత్ జిల్లా అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక స్పందన తెలియజేయలేదు.




