Teachers Day 2026: టీచర్స్ డేకు బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. మీ గురువును ప్రత్యేకంగా ఫీల్ చేయించే బహుమతులు!
Teachers Day Gifts: టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులకు ఏ బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? మీ టీచర్‌ను సంతోషపెట్టే కొన్ని గిఫ్ట్ ఐడియాలు ఇప్పుడు చూద్దాం..!
Teachers Day 2026: టీచర్స్ డేకు బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. మీ గురువును ప్రత్యేకంగా ఫీల్ చేయించే బహుమతులు!
Teachers Day Gifts: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న భారతదేశంలో టీచర్స్ డేను జరుపుకుంటాం. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతో పాటు జీవితంలో సరైన దారిని చూపించే గురువులకు కృతజ్ఞతలు తెలిపే రోజు ఇది. సెప్టెంబర్ 5న భారత మాజీ రాష్ట్రపతి, తొలి ఉపరాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కూడా.
టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులకు ఏ బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఖరీదైన గిఫ్ట్ కంటే.. వారి పట్ల మనకున్న గౌరవాన్ని, కృతజ్ఞతను తెలియజేసే చిన్న బహుమతి మరింత ప్రత్యేకంగా ఉంటుంది. మీ టీచర్‌ను సంతోషపెట్టే కొన్ని గిఫ్ట్ ఐడియాలు ఇవే..
చేతితో రాసిన థ్యాంక్యూ నోట్..
టీచర్‌కు ఇచ్చే బహుమతుల్లో అత్యంత విలువైనది చేతితో రాసిన కృతజ్ఞతా సందేశం కావచ్చు. మీ జీవితంలో ఆ గురువు చేసిన మార్పు, నేర్పిన పాఠాలు, మీపై చూపిన ప్రోత్సాహాన్ని కొన్ని మాటల్లో రాసి ఇవ్వండి. ఇలాంటి వ్యక్తిగత సందేశం చాలా కాలం గుర్తుండిపోతుంది.
పర్సనలైజ్డ్ పెన్ సెట్..
టీచర్లకు ఎప్పుడూ ఉపయోగపడే బహుమతుల్లో మంచి పెన్ ఒకటి. వారి పేరుతో లేదా చిన్న ప్రేరణాత్మక సందేశంతో పర్సనలైజ్ చేసిన పెన్ సెట్ ఇస్తే మరింత ప్రత్యేకంగా ఉంటుంది.
మొక్క
'వృద్ధి'కి ప్రతీకగా ఒక మొక్కను బహుమతిగా ఇవ్వొచ్చు. చిన్న ఇండోర్ ప్లాంట్ అయినా సరే.. టీచర్ దాన్ని చూసిన ప్రతిసారీ విద్యార్థులు గుర్తుకొచ్చేలా ఉంటుంది. మొక్కను సంరక్షించడం, ఎదగడం గురువు-విద్యార్థి బంధానికి చక్కటి ప్రతీకగా నిలుస్తుంది.
పుస్తకాల గిఫ్ట్ కార్డ్..
మీ టీచర్‌కు పుస్తకాలు చదవడం ఇష్టమైతే.. బుక్‌స్టోర్ గిఫ్ట్ కార్డ్ మంచి ఎంపిక. వారు తమకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకోవచ్చు. టీచర్ వ్యక్తిగతంగా చదవడానికి లేదా తరగతి లైబ్రరీ కోసం కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు.
క్లాస్‌రూమ్‌కు ఉపయోగపడే వస్తువులు..
టీచర్లు తరచూ తమ సొంత డబ్బుతో క్లాస్‌రూమ్ అవసరాలను కొనుగోలు చేస్తుంటారు. అందుకే మార్కర్లు, నోట్‌ప్యాడ్లు, స్టిక్కీ నోట్స్ వంటి స్టేషనరీ వస్తువులతో చిన్న గిఫ్ట్ బాస్కెట్ తయారు చేసి ఇవ్వొచ్చు. ఇది అందంగా ఉండటంతో పాటు ఉపయోగకరంగానూ ఉంటుంది.
కాఫీ లేదా టీ బాస్కెట్..
టీ లేదా కాఫీ ఇష్టపడే టీచర్‌కు ఇది మంచి గిఫ్ట్. వారికి నచ్చిన టీ/కాఫీ, అందమైన మగ్, కొన్ని స్నాక్స్‌ను కలిపి ఒక చిన్న బాస్కెట్‌గా తయారు చేసి ఇవ్వొచ్చు.
పర్సనలైజ్డ్ జర్నల్..
టీచర్లు పాఠాల ప్రణాళికలు, ఆలోచనలు, ముఖ్యమైన విషయాలు రాసుకోవడానికి ఉపయోగపడే మంచి జర్నల్‌ను బహుమతిగా ఇవ్వొచ్చు. దానిపై వారి పేరు లేదా చిన్న కృతజ్ఞతా సందేశాన్ని ముద్రిస్తే గిఫ్ట్ మరింత ప్రత్యేకంగా మారుతుంది.
క్లాస్‌రూమ్ డెకర్..
టీచర్ తరగతి గదిని అందంగా, ఆసక్తికరంగా మార్చేందుకు ఉపయోగపడే పోస్టర్లు, బులెటిన్ బోర్డ్ మెటీరియల్, విద్యా సంబంధిత వాల్ డెకల్స్ వంటి వాటిని కూడా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.
ఇన్‌స్పిరేషనల్ వాల్ ఆర్ట్..
'Teaching' లేదా 'Learning'కు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కొటేషన్‌తో వాల్ ఆర్ట్‌ను బహుమతిగా ఇవ్వడం మరో మంచి ఆలోచన. ప్రతిరోజూ దాన్ని చూసినప్పుడు విద్యార్థుల ప్రేమ, గౌరవం గుర్తుకొచ్చేలా ఉంటుంది.
గిఫ్ట్ కంటే భావమే ముఖ్యం..!
టీచర్స్ డే సందర్భంగా ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చామన్నది ముఖ్యం కాదు. మన గురువు చేసిన సేవను గుర్తించి, 'మీ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను' అని చెప్పడం మరింత విలువైనది. చిన్న బహుమతితో పాటు హృదయపూర్వకంగా రాసిన ఓ కృతజ్ఞతా సందేశం ఇస్తే ఈ టీచర్స్ డేను మరింత ప్రత్యేకంగా మార్చొచ్చు.




