గాలిలో ఎగిరే వింతైన చేపలు.. ఎందుకు ఎగురుతాయో తెలుసా.?

flying fish: పక్షుల్లా గాల్లోకి ఎగిరే చేపల గురించి మీకు తెలుసా? సముద్రంలో శత్రువుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ 'ఫ్లయింగ్ ఫిష్' ఏం చేస్తాయి, వాటి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

Ravi
By Ravi
Published on: 25 May 2026 12:32 PM IST
flying fish
X

గాలిలో ఎగిరే వింతైన చేపలు.. ఎందుకు ఎగురుతాయో తెలుసా.?

flying fish: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. సాధారణంగా పక్షులు ఆకాశంలో ఎగరడం, చేపలు నీటిలో ఈదడం మనం చూస్తుంటాం. కానీ పక్షిలా రెక్కలు విప్పి, సముద్రపు అలల పైనుంచి గాల్లోకి ఎగిరే చేపల గురించి మీకు తెలుసా? వీటినే 'ఫ్లయింగ్ ఫిష్' అని పిలుస్తారు. సముద్ర గర్భంలో ఉండే వింత జీవులలో ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఎగిరే చేపల వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలను, అవి అలా ఎందుకు ఎగురుతాయంటే.!

నిజానికి ఈ చేపలకు పక్షుల మాదిరి గాల్లో రెక్కలు ఆడించే శక్తి ఉండదు. కానీ వీటి శరీర నిర్మాణం ఎగరడానికి వీలుగా రూపాంతరం చెందింది. వీటికున్న విశాలమైన రొమ్ము రెక్కలు పక్షి రెక్కలను పోలి ఉంటాయి. సముద్రంలో వేగంగా ఈదుకుంటూ వచ్చి, ఒక్కసారిగా నీటి ఉపరితలం పైకి దూకుతాయి. ఆ సమయంలో తమ రెక్కలను వెడల్పుగా చాచి, గాలి సాయంతో పారాగ్లైడింగ్ చేసినట్లుగా ముందుకు దూసుకుపోతాయి. ఇవి నీటిపై దాదాపు 50 నుంచి 200 మీటర్ల దూరం వరకు సులభంగా ప్రయాణించగలవు.

ఈ చేపలు సరదా కోసం ఆకాశంలోకి ఎగరవు. సముద్రంలో తమను వేటాడే పెద్ద పెద్ద చేపలు దాడి చేసినప్పుడు, వాటి నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఇలా చేస్తాయి. నీటిలో శత్రువులు వెంటాడగానే ఇవి గాల్లోకి ఎగిరి తప్పించుకుంటాయి. అయితే ఇక్కడే వీటికి మరో ప్రమాదం పొంచి ఉంటుంది. ఇవి నీటిపైకి రాగానే ఆకాశంలో వేచి చూసే సముద్ర పక్షులు వీటిని వేటాడి తినేస్తుంటాయి. ఇలా అటు నీటిలోనూ, ఇటు గాల్లోనూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇవి జీవిస్తుంటాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story