Viral Video: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. చివరికి వీడియో తీసి ఏం చెప్పారంటే!

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. కుటుంబం వేర్వేరు సంబంధాలు చూస్తుందనే భయంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్న వైనం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Ravi
By Ravi
Published on: 25 July 2026 7:00 PM IST
Viral Video
X

Viral Video: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. చివరికి వీడియో తీసి ఏం చెప్పారంటే!

Viral Video: సమాజంలో నిత్యం ఎన్నో వింత సంఘటనలు జరుగుతుంటాయి. అందులోనూ సోషల్ మీడియా యుగంలో కొన్ని ఘటనలు క్షణాల్లో వైరల్ అవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకున్న ఒక వినూత్న ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్లుగా రాణిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు తాము కలిసి ఒకే యువకుడిని వివాహం చేసుకున్నామని ప్రకటించడం సంచలనం సృష్టించింది. అమ్రోహా పరిధిలోని హసన్‌పూర్ ప్రాంతానికి చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ అనే ముగ్గురు యువతులు తమ వద్ద కెమెరామెన్‌గా పనిచేస్తున్న వికాస్ అనే యువకుడిని ఆలయంలో వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ వివాహానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరిస్తూ, తాము చిన్నప్పటి నుండి కలిసే పెరిగామని, పెళ్లి తర్వాత విడిచి ఉండలేమని ఆ యువతులు తెలిపారు. కుటుంబ సభ్యులు తమకు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్నారని, ఆ ఆలోచనే తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని వారు పేర్కొన్నారు. చివరికి వేర్వేరుగా ఉండి చనిపోవడం కంటే, ముగ్గురం కలిసి ఒకే వ్యక్తిని వివాహం చేసుకుని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు వారు స్పష్టం చేశారు. తమంతట తాముగా పూర్తి స్పృహతో, వయోజనులుగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.

కాగా, ఈ వివాహంపై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని తప్పుబడుతుండగా, మరికొందరు వారి వ్యక్తిగత స్వేచ్ఛగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు హిందూ వివాహ చట్టం ప్రకారం ఒకే సమయంలో ఒక వ్యక్తి మూడు వివాహాలు చేసుకోవడం చట్టవిరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు, అధికారులకు ఎలాంటి ఫిర్యాదులు అందనప్పటికీ, దీనికి సంబంధించిన అన్ని కోణాలపై దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈ విలక్షణ వివాహం ప్రస్తుతం స్థానికంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story