వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా..?

Marries Three Sisters: సోషల్ మీడియాలో పాపులారిటీ, ఫాలోవర్స్, వ్యూస్ కోసం ఎవరైనా ఎంతవరకైనా తెగిస్తారు అనేదానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం.

Naresh.k
Published on: 29 July 2026 3:51 PM IST
Marries Three Sisters
X

వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా..?

Marries Three Sisters: సోషల్ మీడియాలో పాపులారిటీ, ఫాలోవర్స్, వ్యూస్ కోసం ఎవరైనా ఎంతవరకైనా తెగిస్తారు అనేదానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకే వ్యక్తి వివాహం చేసుకున్నాడంటూ సోషల్ మీడియాను షేక్ చేసిన వార్త తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సమాజంలో ఎంతో చర్చనీయాంశంగా మారిన ఈ వార్త వెనుక ఉన్న ఊహించని అసలు నగ్న సత్యం ఇప్పుడు బయటపడింది. అది అసలైన పెళ్లి కాదని, కేవలం వ్యూస్ కోసం ఆడిన ఓ క్రాస్‌-లెవెల్ ఫ్రాంక్ డ్రామా అని తేలిపోయింది.

ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్న వీడియో విపరీతంగా వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆ వీడియోలో ఉన్న ముగ్గురు యువతుల్లో ఒకరు మైనర్ అని, ఇది చట్టరీత్యా నేరమని పేర్కొంటూ ఒక వ్యక్తి చైల్డ్ సోషల్ వెల్ఫేర్ కమిటీ కి పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై తక్షణమే విచారణ చేపట్టాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.

ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన చైల్డ్ సోషల్ వెల్ఫేర్ కమిటీ, ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించింది. సంబంధిత వ్యక్తులను పిలిపించి విచారించగా, అసలు గుట్టు రట్టయింది. తాము అసలు పెళ్లి చేసుకోలేదని, కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ, ఫాలోవర్స్ పెంచుకోవడానికే ఈ పెళ్లి నాటకం ఆడామని ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు విచారణలో ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని CWC చైర్మన్ అధికారికంగా మీడియాకు వెల్లడించారు. నెటిజన్లను, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఈ వీడియోను రూపొందించారని చెప్పారు.

సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం మైనర్లను ఇరికించి, అనైతిక వికృత చేష్టలతో ప్రచారాలు చేసే వారిపై చైల్డ్ సోషల్ వెల్ఫేర్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యూస్, ఫాలోవర్స్ కోసం చట్టానికి, సమాజానికి విరుద్ధంగా ఇలాంటి డ్రామాలు ఆడితే కఠిన చర్యలు తప్పవు. మైనర్ల భద్రత, చట్టపరిమితులను ఉల్లంఘించే క్రియేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story