Viral News: వామ్మో.. పెళ్లి చీర నచ్చలేదని పెళ్ళినే ఆపేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Viral News: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియాలో వింత ఘటన చోటుచేసుకుంది. వరుడు తెచ్చిన చీర నచ్చలేదని వధువు పెళ్లి నిరాకరించడంతో, రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి వివాహం రద్దయింది.

Arun Chilukuri
Published on: 14 May 2026 6:20 AM IST
Viral News
X

Viral News: వామ్మో.. పెళ్లి చీర నచ్చలేదని పెళ్ళినే ఆపేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Viral News: కేవలం ఒక చీర విషయంలో తలెత్తిన వివాదం.. ఒక పెళ్లిని నిలిపివేయడమే కాకుండా, రెండు కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది.

రేవతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయ్‌ఘాట్ గ్రామంలో గల పంచ్‌రుఖి అమ్మవారి ఆలయంలో ఈ నెల 11వ తేదీన విశాల్ గోండ్, నికీల వివాహం జరగాల్సి ఉంది. వరుడి తరఫు వారు బారాత్‌తో ఘనంగా తరలివచ్చారు. పెళ్లి క్రతువు మొదలయ్యే సమయంలో, వరుడి కుటుంబ సభ్యులు పెళ్లికూతురికి చీరను బహుకరించారు. అయితే, ఆ చీర తనకు ఏమాత్రం నచ్చలేదని, అది తనకు నప్పడం లేదని వధువు నికీ పెళ్లికి ససేమిరా అంది.

వధువు మొండికేయడంతో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి అది పెద్ద ఘర్షణగా మారింది. ఈ గొడవలో వరుడి తల్లి, సోదరుడు సహా మరో మహిళకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ మహమ్మద్ ఫహీం ఖురేషీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

వధువు తండ్రి ఫిర్యాదు మేరకు వరుడు విశాల్‌తో పాటు అతని బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పెళ్లి ఆగిపోవడమే కాకుండా, వరుడి ఊరేగింపు (బారాత్) వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story