Viral: నుదిటిపై సాధారణ మచ్చ అనుకుంది.. కట్ చేస్తే.. కొన్నేళ్లకు నిజం తేలింది.!

Viral: చర్మంపై కనిపించే చిన్న మార్పులను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని నిరూపించే విషాద ఘటన అమెరికాలో వెలుగు చూసింది.

Ravi
By Ravi
Published on: 30 July 2026 8:08 PM IST
Viral
X

Viral: నుదిటిపై సాధారణ మచ్చ అనుకుంది.. కట్ చేస్తే.. కొన్నేళ్లకు నిజం తేలింది.!

Viral: చర్మంపై కనిపించే చిన్న మచ్చలు లేదా మార్పులను తేలికగా తీసుకోవడం ఎంతటి ప్రమాదకరమో చాటిచెప్పే విషాద సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మెలనోమా (చర్మ క్యాన్సర్) కారణంగా అమెరికాకు చెందిన అలోండ్రా సియెర్రా అనే 26 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. తన 19 ఏళ్ల వయసులో నుదుటిపై ఒక చిన్న మచ్చ ఏర్పడింది. అయితే అది సాధారణ మచ్చ మాత్రమేనని భావించిన ఆ యువతి దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. క్రమంగా ఆ మచ్చ తీవ్ర రూపం దాల్చడంతో అసలు సమస్య మొదలైంది.

ఆ మచ్చ ఏర్పడిన మూడేళ్ల తర్వాత వైద్యులను సంప్రదించగా అది చర్మ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. అయితే అప్పటికే వ్యాధి శరీరంలో బాగా ముదిరిపోయి ఇతర అవయవాలకు విస్తరించింది. క్యాన్సర్ చివరి దశకు చేరుకోవడంతో వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. తన జీవితంలో ఎదురైన ఈ చేదు అనుభవం ద్వారా ఇతరులను హెచ్చరించడానికి అలోండ్రా తీవ్రంగా శ్రమించింది. చర్మంపై కనిపించే ఎలాంటి చిన్న మార్పులనైనా, మచ్చలనైనా నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ఆమె చనిపోవడానికి ముందు అనేక వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కాగా, మెలనోమా అనేది అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మంపై రంగు మారడం, మచ్చలు రావడం, లేదా పాత మచ్చల పరిమాణం పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు ఉపేక్షించవద్దని సూచిస్తున్నారు. సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు చర్మ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story