Viral News: పెళ్లిలో ఊహించని ట్విస్ట్: వరుడు మాల వేయబోతుంటే.. ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా!

Viral News: వారణాసి జిల్లాలో ఒక వివాహం ఊహించని మలుపు తిరిగింది. వరమాల వేసే సమయంలో వధువు పెళ్లి పీటల నుంచి దిగి తన ప్రియుడి వద్దకు వెళ్లడంతో పెళ్లి మండపంలో రసాభాస జరిగింది.

Arun Chilukuri
Published on: 9 May 2026 2:19 PM IST
Viral News
X

Viral News: పెళ్లిలో ఊహించని ట్విస్ట్: వరుడు మాల వేయబోతుంటే.. ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా!

Viral News: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పరిధిలో గల ఛితౌనీ గ్రామంలో ఒక వివాహ వేడుక తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. బాజాభజంత్రీలు, బంధువుల కోలాహలం మధ్య జరగాల్సిన పెళ్లి.. వధువు తీసుకున్న ఒక్క నిర్ణయంతో రసాభాసగా మారింది.

వధువు కిరణ్ రాజ్‌భర్ మెడలో వరుడు వరమాల వేయబోతున్న తరుణంలో అసలు డ్రామా మొదలైంది. పెళ్లి పీటల మీద ఉన్న కిరణ్, ఒక్కసారిగా కిందకు దిగి గుంపులో ఉన్న తన ప్రియుడు పవన్ వైపు పరుగెత్తింది. "నేను పెళ్లంటూ చేసుకుంటే ఇతడినే చేసుకుంటా" అని తెగేసి చెప్పడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆగ్రహించిన వరుడి తరపు బంధువులు ప్రియుడిపై దాడికి దిగగా, వధువు అతడికి అడ్డుగా నిలబడి తన ప్రేమను చాటుకుంది.

కిరణ్, పవన్ గత కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కిరణ్ కుటుంబ సభ్యులు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. తన ప్రేయసిని ఆఖరిసారి చూద్దామని పవన్ ఆ పెళ్లికి రాగా, అతడిని చూసిన కిరణ్ తన నిర్ణయాన్ని మార్చుకుంది.

విషయం కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరడంతో గంటల తరబడి చర్చలు జరిగాయి. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా కిరణ్ మాత్రం తన పట్టు వీడలేదు. చివరికి ఇరు కుటుంబాలు రాజీకి వచ్చి, ప్రేమికులిద్దరికీ పెళ్లి చేయడమే సరైన మార్గమని భావించారు. అనంతరం స్థానిక దేవాలయంలో కిరణ్, పవన్‌ల వివాహం ఘనంగా జరిగింది. వచ్చిన బారాత్ ఖాళీగా వెనుదిరిగినప్పటికీ, ఒక ప్రేమ కథ సుఖాంతం కావడంతో ఈ వార్త స్థానికంగా వైరల్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story