First Night: శోభనం గదిలో బాంబు పేల్చిన భార్య..!
First Night: పెళ్లయిన మొదటి రాత్రే భార్య ఇచ్చిన షాక్‌తో రెండేళ్ల కోర్టు పోరాటం, రూ.10 లక్షల భరణం చెల్లించిన భర్త.
First Night: శోభనం గదిలో బాంబు పేల్చిన భార్య..!
Arranged Marriage: అరేంజ్డ్ మ్యారేజ్‌లో కొత్త జీవితాన్ని ఎన్నో ఆశలతో ప్రారంభించిన ఒక యువకుడికి శోభనం రోజే ఊహించని నరకం ఎదురైంది. ఎలాంటి తప్పు చేయకపోయినా, కనీసం శారీరక బంధం కూడా ఏర్పడకపోయినా సదరు భర్త విడాకుల కోసం ఏకంగా రెండేళ్ల సమయం, రూ. 10 లక్షల డబ్బును మూల్యాంకనంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లికి ముందు ఇరువైపులా పెద్దలు కుదిర్చిన ఈ సంబంధంలో దాదాపు 8 నెలల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ సమయంలో వీరి పరిచయం చాలా సజావుగానే సాగింది. అయితే పెళ్లికి ముందు శారీరక బంధం వద్దని యువతి కోరగా, భర్త ఆమె నిర్ణయాన్ని పూర్తిగా గౌరవించాడు.
కానీ, పెళ్లయి శోభనం గదిలోకి అడుగుపెట్టిన వెంటనే భార్య అసలు నిజం బయటపెట్టింది. తనకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదని, కేవలం ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే చేసుకున్నానని తెగేసి చెప్పేసింది. తానేమైనా చేసుకుంటానని ఇంట్లోవాళ్లు బెదిరించడంతోనే ఒప్పుకోవాల్సి వచ్చిందని భర్తకు తెలిపింది. కావాలంటే నన్ను బలవంతం చేయవచ్చు అని ఆమె అనడంతో, ఆమె ఆత్మగౌరవాన్ని గౌరవించిన భర్త వెనక్కి తగ్గి ఎలాంటి బలవంతం చేయలేదు.
ఇరువైపులా సమ్మతితో విడిపోవాలని నిర్ణయించుకున్నా, చట్టబద్ధంగా విడాకులు పొందడం సదరు వ్యక్తికి సులభం కాలేదు. కోర్టుల చుట్టూ తిరగడానికి బాధితుడికి రెండేళ్ల విలువైన సమయం వృథా అయ్యింది.
ఎటువంటి శారీరక బంధం లేకపోయినా, కోర్టు ఖర్చులు భరణం కింద ఏకంగా రూ. 10 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.
@fintech_shark అనే ఎక్స్ ఖాతా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం నెటిజన్లను తీవ్రంగా కలిచివేసింది. ఎలాంటి తప్పు చేయని భర్తకు ఇన్ని శిక్షలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.కనీసం శారీరక సంబంధమే లేనప్పుడు విడాకులుకాకుండా వివాహ రద్దు అడిగి ఉంటే బెటర్ అయ్యేదని కొందరు కామెంట్ చేశారు.
భారతీయ వివాహ చట్టాలు పురుషుల పట్ల నిష్పాక్షికంగా లేవని, స్త్రీల ఒత్తిడికి బలవుతున్న పురుషులకు రక్షణ కల్పించే చట్టాలు రావాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎంతోమంది జీవితాలకు ఉదాహరణగా నిలిచిన ఈ సంఘటన, ప్రస్తుతం వివాహ వ్యవస్థ వైవాహిక చట్టాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.




