Viral Video: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! మోదీ మాస్క్ పెట్టుకుని మరీ..

Viral Video: రాజస్థాన్‌లో జరిగిన ఓ వింత దొంగతనం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్ ధరించిన ఓ దొంగ మొబైల్ షాపులో లక్షల రూపాయల విలువైన ఫోన్లను దోచుకెళ్లాడు.

Ravi
By Ravi
Published on: 1 July 2026 2:49 PM IST
Viral Video
X

Viral Video: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! మోదీ మాస్క్ పెట్టుకుని మరీ..

Viral Video: దొంగలు చోరీ చేయడానికి రకరకాల వేషాలు వేయడం మనం చూస్తుంటాం. కానీ రాజస్థాన్‌లో ఓ దొంగ ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్ ధరించి మొబైల్ షోరూమ్‌లో భారీ చోరీకి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కరేడా పట్టణంలో ఈ వింత చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో మాతేశ్వరి మొబైల్ షాపులోకి దొంగలు పైకప్పు మీదుగా లోపలికి ప్రవేశించారు. తమ ముఖాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు, అందులో ఒక దొంగ ప్రధాని నరేంద్ర మోదీ ముఖం ఉన్న మాస్క్‌ను ధరించాడు.

లోపలికి చొరబడిన ఈ దొంగలు సుమారు రూ. 4 నుంచి 5 లక్షల విలువైన 35-40 ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు యజమాని వచ్చి చూడగా ఫోన్ల బాక్సులు ఖాళీగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అంతేకాకుండా, అదే రాత్రి పట్టణంలో ఉన్న మరో మొబైల్ షాపు వద్ద కూడా మోదీ మాస్క్ ధరించిన ఇదే దొంగ షట్టర్ తాళాలు పగలగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story