Monalisa : పెళ్లై నెల కాలేదు అప్పుడే మోనాలిసా ప్రెగ్నెంట్ ? అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కొత్త స్కెచా?

Monalisa : వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే ప్రెగ్నెంట్ అంటూ భర్త ఫర్మాన్ ప్రకటించాడు. అరెస్ట్ చేయడానికి వెళ్లిన మధ్యప్రదేశ్ పోలీసులు ఖాళీ చేతులతో వెనుదిరిగారు. వయస్సు వివాదంపై హైడ్రామా కొనసాగుతోంది.

CR Reddy
Published on: 22 April 2026 9:28 AM IST
Monalisa Bhosale
X

 Monalisa Bhosale

Monalisa : ప్రయాగ రాజ్ కుంభమేళాలో తన అందచందాలతో సోషల్ మీడియాను ఊపేసిన వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే వ్యవహారం ఇప్పుడు సినిమా రికార్డులను తలపిస్తోంది. ఆమె ప్రేమ వివాహం కాస్తా ఇప్పుడు పోలీసు కేసులు, కోర్టు చుట్టూ తిరుగుతోంది. మధ్యప్రదేశ్ నుంచి కేరళ వరకు పాకిన ఈ హైడ్రామాలో ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనే కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. అసలు మోనాలిసా ప్రెగ్నెంటా ? లేక అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఏం జరిగిందంటే?

ప్రయాగరాజ్ కుంభమేళాలో మోనాలిసా భోంస్లే ఫోటోలు వైరల్ కావడంతో ఆమె ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. అయితే, తన ప్రియుడు మహమ్మద్ ఫర్మాన్‌తో కలిసి ఆమె ఇంటి నుంచి పారిపోయి కేరళలో వివాహం చేసుకుంది. దీనిపై మోనాలిసా తండ్రి మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురు మైనర్ అని, ఆమె వయస్సు కేవలం 16 ఏళ్లేనని ఆయన ఆరోపించారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) కూడా ఆమె మైనర్ అని తేల్చడంతో, పోలీసులు ఫర్మాన్ మీద పోక్సో (POCSO) యాక్ట్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

పోలీసుల ఎంట్రీ - ప్రెగ్నెన్సీ ట్విస్ట్

ఫర్మాన్, మోనాలిసా కేరళలోని కోచిలో ఉన్నారని తెలుసుకున్న ఎంపీ పోలీసులు ఐదుగురు సభ్యుల బృందంగా అక్కడికి వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకుని మధ్యప్రదేశ్‌కు తరలించాలని ప్లాన్ చేశారు. అయితే, సరిగ్గా అప్పుడే ఫర్మాన్ ఒక బాంబు పేల్చాడు. మోనాలిసా ప్రస్తుతం గర్భవతి అని, ఈ స్థితిలో ఆమె ప్రయాణం చేయలేదని పోలీసులకు తెలిపాడు. మానవతా దృక్పథంతో, ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.

మోనాలిసా మైనరా? మేజరా?

ఈ కేసులో ప్రధాన పాయింట్ మోనాలిసా వయస్సు. ఆమె తండ్రి 16 ఏళ్లని చెబుతుంటే, మోనాలిసా మాత్రం తాను మేజర్ అని (18 ఏళ్లు నిండాయని), మార్చి 11న తిరువనంతపురంలోని ఒక ఆలయంలో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నానని చెబుతోంది. ప్రస్తుతం కేరళ హైకోర్టు ఫర్మాన్ అరెస్టుపై మే 20 వరకు స్టే విధించడంతో పోలీసులకు చేతులు కట్టేసినట్లయింది. మరోవైపు, తమను బలవంతంగా మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని, తమకు రక్షణ కల్పించాలని మోనాలిసా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాసింది.

జోషువా కోసం వేట

ఈ ప్రేమ జంటకు కేరళలో ఆశ్రయం కల్పించి, పెళ్లికి ఏర్పాట్లు చేసిన ఫర్మాన్ స్నేహితుడు జోషువా కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఒకవేళ మోనాలిసా ప్రెగ్నెన్సీ నిజమని తేలితే, ఈ కేసు మరిన్ని న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మైనర్ వివాహం, గర్భం దాల్చడం వంటి అంశాలు ఫర్మాన్ మీద నమోదైన పోక్సో కేసును మరింత తీవ్రతరం చేయవచ్చు. ఏది ఏమైనా, ప్రయాగ రాజ్ కుంభమేళా సుందరి జీవితం ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story