అందరిని అయోమయంలో పడేసిన ఐక్యూ పజిల్.. మీరు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారా?

Viral Puzzle: viral IQ puzzle Discover, why 15 + 9 equals 246. ఐక్యూ పజిల్స్‌లో కొన్ని సులభంగా కనిపించినా.. సాల్వ్ చేసే సమయంలో మాత్రం చాలా మందిని ఆలోచింపజేస్తాయి.

Rishvik
Published on: 4 Aug 2026 8:23 PM IST
Viral Puzzle
X

అందరిని అయోమయంలో పడేసిన ఐక్యూ పజిల్.. మీరు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారా?

Viral Puzzle: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఐక్యూ పజిల్స్ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని సులభంగా కనిపించినా.. సాల్వ్ చేసే సమయంలో మాత్రం చాలా మందిని ఆలోచింపజేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఓ మ్యాథ్స్ పజిల్ నెటిజన్ల దృష్టిని తెగ ఆకర్షిస్తోంది. 'If you solve this, you're a genius' అనే క్యాప్షన్‌తో వైరల్ అవుతున్న ఈ పజిల్‌కు వేలాది మంది తమదైన శైలిలో సమాధానాలు చెబుతున్నారు. అయితే చాలా మంది తప్పుడు సమాధానం ఇస్తున్నారు.

వైరల్ పజిల్‌లో 7 + 3 = 104, 8 + 5 = 133, 12 + 6 = 186 అని ఇచ్చి.. చివరగా 15 + 9 = ??? అని ప్రశ్నించారు. సాధారణ గణితం ప్రకారం చూస్తే.. ఇందుకు సమాధానం దొరకదు. ఇందులో దాగి ఉన్న ప్యాటర్న్‌ను కనిపెట్టాలి. ఆ ప్యాటర్న్‌ ఏంటో కనిపెట్టేందుకు నెటిజన్లు తెగ ప్రయత్నిస్తున్నారు. కొందరు 299 అని సమాధానం చెబుతుంటే, మరికొందరు 310 అని వాదిస్తున్నారు. ఇంకొందరు పూర్తిగా భిన్నమైన పద్ధతుల్లో లెక్కలు వేసి వేరే సమాధానాలను సూచిస్తున్నారు. అయితే అసలు ఆన్సర్ మాత్రం 246. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఈ వైరల్ పజిల్‌ ప్యాటర్న్‌ చాలా సింపుల్. ముందుగా 7 + 3 = 104 అని ఇచ్చారు. 104 రావడానికి మనం ఇచ్చిన సంఖ్యను ఓసారి ప్లస్ చేయాలి, మరోసారి మైనస్ చేసి.. రెండు అంకెలను పక్కపక్కనే వేయాల్సి ఉంటుంది. 7 + 3 = 10, 7 - 3 = 4.. అప్పుడు 10, 4 అంకెలను పక్కనే ఉంచితే 104 అవుతుంది. 8 + 5 = 133 కోసం 8 + 5 = 13, 8 - 5 = 3 చేస్తే... 133 ఆన్సర్ వస్తుంది. 12 + 6 = 18, 12 - 6 = 6 కాగా.. 18, 6 అంకెలను పక్కపక్కనే వేసస్తే.. 186 ఆన్సర్. ఇక మనం సాల్వ్ చేయాల్సిన 15 + 9 = ??? చూద్దాం. 15 + 9 = 24, 15 - 9 = 6 కాగా.. 24, 6 అంకెలను పక్కపక్కనే ఉంచితే 246 అవుతుంది.

ఇలాంటి వైరల్ ఐక్యూ పజిల్స్‌లో చాలావరకు ఒకే గణిత సూత్రం ఉండకపోవచ్చు. పజిల్ రూపొందించిన వ్యక్తి రూపొందించిన ప్యాటర్న్ ఏమిటో తెలియకపోతే.. ఖచ్చితమైన సమాధానాన్ని కనుక్కోవడం చాలా కష్టం. సమాధానం చెప్పడానికి ముందుగా.. అన్ని విధాలుగా ఆలోచించాలి. ఈ పజిల్‌లో మనం అడిషన్ అండ్ సబ్స్ట్రక్షన్ చేశాం. అందుకే ఈ పజిల్‌ను కేవలం గణిత పరీక్షగా కాకుండా.. తార్కిక ఆలోచన (లాజికల్ థింకింగ్), ప్యాటర్న్ గుర్తించే సామర్థ్యాన్ని పరీక్షించే ఛాలెంజ్‌గా చూడాలి. ఈ పజిల్స్‌ను మీ స్నేహితులకు పంపి.. వారు ఎంత త్వరగా సాల్వ్ చేస్తారో చూడండి. 30 సెకండ్ల లోపు ఆన్సర్ చెబితే... వారి ఐక్యూ లెవల్ బాగున్నట్టే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story