ఈ పజిల్‌కు 15 సెకన్లలో సమాధానం చెప్పగలరా?.. ఆన్సర్ తెలిస్తే మీ బ్రెయిన్ సూపరో సూపర్!

Viral Math Puzzle: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన మ్యాథ్స్ పజిల్ వైరల్‌గా మారింది.

Rishvik
Updated on: 11 Aug 2026 10:13 PM IST
Viral Math Puzzle
X

ఈ పజిల్‌కు 15 సెకన్లలో సమాధానం చెప్పగలరా?.. ఆన్సర్ తెలిస్తే మీ బ్రెయిన్ సూపరో సూపర్!

Viral Math Puzzle: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన మ్యాథ్స్ పజిల్ వైరల్‌గా మారింది. సాధారణంగా చూస్తే.. ఇందులో ఇచ్చిన లెక్కలకు సరైన సమాధానాలు లేవు. కానీ కాస్త భిన్నంగా ఆలోచిస్తే ఇందులో దాగి ఉన్న ప్యాటర్న్‌ను సులభంగా గుర్తించవచ్చు. ఈ పజిల్‌లో నాలుగు ఉదాహరణలను ఇచ్చి.. చివరగా 5+5 = ? అని ప్రశ్నించారు. 15 సెకన్లలో సమాధానం చెప్పగలిగితే మీ పరిశీలనా శక్తి అద్భుతంగా ఉన్నట్టే.

చాలా మంది పజిల్‌లోని ప్యాటర్న్‌ను గుర్తించక సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. మొదట 8+1 = 97 అని ఇచ్చారు. సాధారణంగా 8+1 చేస్తే 9 వస్తుంది. కానీ ఇక్కడ 7 రావడానికి ప్యాటర్న్‌ అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా 8+1 = 9 అని లెక్కించాలి. ఆ తర్వాత 8-1 = 7 అని చేయాలి. ఈ రెండు ఫలితాలను పక్కపక్కన పెడితే 97 వస్తుంది. ఇదే విధంగా రెండో లెక్కను పరిశీలిస్తే 7+2 = 95 అని ఉంది. ఇక్కడ 7+2 = 9, అలాగే 7-2 = 5. ఈ రెండు ఫలితాలను కలిపితే 95 అవుతుంది.

మూడో వరుసలో 6+3 = 93 అని ఇచ్చారు. 6+3 = 9, 6-3 = 3. కాబట్టి ఈ రెండు ఫలితాలను కలిపి 93గా వస్తుంది. అలాగే నాలుగో దాంట్లో 4+3 = 71 అని ఉంది. 4+3 = 7, 4-3 = 1. ఈ రెండు సమాధానాలను పక్కపక్కన రాస్తే 71 వస్తుంది. దీంతో పజిల్‌లోని అసలు ప్యాటర్న్ ఏమిటో అర్థమవుతుంది. ఇప్పుడు చివరి ప్రశ్న 5+5 = ?. ముందుగా 5+5 చేస్తే 10 వస్తుంది. ఆ తర్వాత 5-5 చేస్తే 0 వస్తుంది. పజిల్‌లోని ప్యాటర్న్ ప్రకారం ఈ రెండు ఫలితాలను పక్కపక్కన కలిపి రాయాలి. అంటే 10, 0ను కలిపితే 100 వస్తుంది. ఈ పజిల్‌కు అసలు సమాధానం: 5+5 = 100

ఈ పజిల్‌ను సాధారణంగా చేసే 10 సమాధానం సరైనది కాదు. ఇచ్చిన ప్యాటర్న్‌ను అనుసరిస్తే.. 100నే సరైన సమాధానం. మొదటి లెక్కలన్నింటిలోనూ కూడిక ఫలితాన్ని ముందుగా, తీసివేత ఫలితాన్ని తర్వాత ఉంచి రెండు సంఖ్యలను కలిపారు. అదే నియమాన్ని చివరి లెక్కకు వర్తింపజేస్తే 5+5 = 10, 5-5 = 0 → 100 అవుతుంది. ఇలాంటి పజిల్స్‌లో గణితం కంటే ప్యాటర్న్‌ను గుర్తించడం, పరిశీలనతో ఆలోచించడం ముఖ్యమైనది. మీరు 15 సెకన్లలోనే సమాధానం గుర్తించారా? ఓసారి చెక్ చేసుకోండి. 15 సెకన్లలోనే ఆన్సర్ తెలిస్తే మీ బ్రెయిన్ సూపరో సూపర్ అని అర్ధం.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story