Viral News: క్రేజీ ఆఫర్: కోట్లలో జీతం.. కంపెనీయే గర్ల్‌ఫ్రెండ్‌ను వెతికి పెడుతుంది!

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు బంపర్ ఆఫర్. రూ. 3 కోట్ల జీతంతో పాటు గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా ఇస్తామంటోంది శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన క్లూలీ (Cluly) స్టార్టప్. ఈ వైరల్ వార్త వెనుక ఉన్న అసలు కారణాలేంటో చూడండి.

Arun Chilukuri
Published on: 18 April 2026 10:58 AM IST
Viral News
X

Viral News: క్రేజీ ఆఫర్: కోట్లలో జీతం.. కంపెనీయే గర్ల్‌ఫ్రెండ్‌ను వెతికి పెడుతుంది!

Viral News: టెక్ ప్రపంచంలో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే. అయితే ఉద్యోగులను ఆకర్షించేందుకు కంపెనీలు ఇచ్చే ఆఫర్లు ఇప్పుడు రూటు మార్చాయి. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'క్లూలీ' (Cluly) అనే ఏఐ స్టార్టప్ ప్రకటించిన ఒక వింత ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా వెళ్లే ఈ కంపెనీ, టాప్ లెవల్ ఇంజనీర్ల కోసం వెతుకుతోంది. ఎంపికైన వారికి ప్రారంభంలోనే రూ. 3 కోట్ల (సుమారు $360,000) ప్యాకేజీతో పాటు కంపెనీలో 0.5 శాతం ఈక్విటీని ఆఫర్ చేస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తోంది. అయితే అన్నింటికంటే హాట్ టాపిక్ ఏమిటంటే.. ఏడాది తర్వాత ఉద్యోగికి ఒక గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్‌ను కూడా సెట్ చేస్తామని కంపెనీ పేర్కొనడం.

ఈ కంపెనీలో పని చేయడం అంత సులభం కాదు. ఉద్యోగులు రోజుకు కనీసం 12 గంటల పాటు తీవ్రమైన ఒత్తిడి మధ్య పని చేయాల్సి ఉంటుంది. ఇంతటి ఒత్తిడిని భరించే ఇంజనీర్ల పర్సనల్ లైఫ్ దెబ్బతినకుండా ఉండేందుకే ఈ 'డేటింగ్ వ్యవస్థ'ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ సీఈఓ చింగిన్ రాయ్లీ తెలిపారు. కంపెనీలో పని చేసే ప్రతి ఒక్కరూ సంతోషంగా వివాహం చేసుకునే వరకు ఈ మద్దతు కొనసాగుతుందని ఆయన పేర్కొనడం గమనార్హం. కేవలం అత్యుత్తమ ప్రతిభ ఉన్న ఇంజనీర్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story