Viral News: తెల్లారి 4 గంటలకు క్యాబ్ బుక్ చేసిన మహిళ.. రైడ్ తర్వాత డ్రైవర్ చేసిన పనికి.!
Viral News: గురుగ్రామ్‌లో తెల్లవారుజామున 4 గంటలకు ఉబెర్ బుక్ చేసుకున్న ఒక మహిళకు భయానక అనుభవం ఎదురైంది.
Viral News: తెల్లారి 4 గంటలకు క్యాబ్ బుక్ చేసిన మహిళ.. రైడ్ తర్వాత డ్రైవర్ చేసిన పనికి.!
Viral News: మహిళల భద్రతపై ఎన్ని చట్టాలు వస్తున్నా, క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఎన్ని భద్రతా ఫీచర్లు తెస్తున్నా.. క్యాబ్‌లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా గురుగ్రామ్‌లో ఓ మహిళకు ఇలాంటి భయానక అనుభవమే ఎదురైంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉబెర్ బుక్ చేసుకున్న ఆమెను డ్రైవర్ అదనపు ఛార్జీలు డిమాండ్ చేసి వేధించడమే కాకుండా, రైడ్ పూర్తయ్యాక కూడా ఆమెకు ఫోన్ చేశాడు. ఈ ఘటనను ఆమె ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో పంచుకోవడంతో ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
ఓ మహిళా ప్రయాణికురాలు తన అవసరం నిమిత్తం తెల్లవారుజామున 4 గంటలకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ ఎక్కిన తర్వాత డ్రైవర్ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. యాప్‌లో చూపించిన ఛార్జీ కాకుండా, అదనపు డబ్బులు ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. అతడి ప్రవర్తనతో ఆ మహిళ తీవ్ర భయాందోళనలకు గురైంది. రైడ్ పూర్తయి.. ఆమె గమ్యస్థానం చేరుకున్న తర్వాత ఈ కథ ముగిసిందా అంటే అదీ లేదు.
రైడ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ ఉబెర్ డ్రైవర్ ఆమె ఫోన్ నంబర్‌కు నేరుగా కాల్ చేసి భయభ్రాంతులకు గురిచేశాడు. సాధారణంగా యాప్ ద్వారా కాల్స్ వెళ్తే ప్రయాణికుల నంబర్ డ్రైవర్లకు కనిపించదు. కానీ రైడ్ ముగిశాక కూడా డ్రైవర్ ఆమె వ్యక్తిగత నంబర్‌కు కాల్ చేయడం ఆమెను మరింత భయపెట్టింది. భద్రతా పరమైన అనేక ప్రశ్నలను తలెత్తేలా చేసింది.
తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని, భద్రతా వైఫల్యాన్ని వివరిస్తూ సదరు మహిళ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టింది. ఉబెర్ లాంటి సంస్థల్లో మహిళల భద్రత ఎంత ప్రశ్నార్థకంగా మారిందో ఆమె వివరించింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. క్యాబ్ సంస్థలు మహిళల భద్రత విషయంలో డ్రైవర్ల బ్యాక్‌గ్రౌండ్ చెక్ కఠినంగా చేయాలని, ఇలాంటి డ్రైవర్లపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




