Viral News: 45 ఏళ్ల వయసు తేడాతో ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం: రీల్స్ కోసం ఎంతకైనా దిగజారుతారా?
Viral News: ఉత్తర్‌ప్రదేశ్‌లో 75 ఏళ్ల వృద్ధుడితో 30 ఏళ్ల యూట్యూబర్ రీనా రాజ్‌పుత్ నిశ్చితార్థం పబ్లిసిటీ డ్రామాగా తేలింది. పాత భర్త రాగానే ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుంది.
Viral News: 45 ఏళ్ల వయసు తేడాతో ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం: రీల్స్ కోసం ఎంతకైనా దిగజారుతారా?
Viral News: సోషల్ మీడియాలో కేవలం వ్యూస్, లైక్స్, ఫాలోవర్లను పెంచుకోవడమే ధ్యేయంగా కొందరు కంటెంట్ క్రియేటర్లు ఏ స్థాయికైనా దిగజారుతున్నారనడానికి ఉత్తర్‌ప్రదేశ్ వేదికగా జరిగిన ఒక విడ్డూరపు ఘటనే నిదర్శనం. యూపీలోని ఔరైయా జిల్లాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు రామ్ సుఘర్, 30 ఏళ్ల బ్లాగర్ రీనా రాజ్‌పుత్‌ల మధ్య ఇటీవల జరిగిన సంచలన నిశ్చితార్థం వెనుక ఉన్న అసలు నిజం బయటపడటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం వీరిద్దరి మధ్య ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య ఏకంగా 45 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటంతో ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో రీనా రాజ్‌పుత్ స్పందిస్తూ "ప్రేమకు వయసుతో సంబంధం లేదు" అని వ్యాఖ్యానించడంతో అనేకమంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
అయితే, ఈ హడావుడి అంతా కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం ఆడిన నాటకమేనని తేలిపోయింది. తాజాగా రీనా రాజ్‌పుత్ మరొక వీడియోను షేర్ చేస్తూ.. రామ్ సుఘర్‌తో జరిగిన తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలో కుటుంబ తగవుల కారణంగా తనను వదిలివెళ్లిన పాత భర్తే తిరిగిరావడంతో అతనితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అంతేకాకుండా ఆ వీడియోలో తన అసలు భర్తతో కలిసి మళ్లీ దండలు మార్చుకుంటున్న దృశ్యాలు ప్రదర్శించింది.
వ్యూస్ మరియు డబ్బు సంపాదన కోసమే రీనా ఈ తరహా చౌకబారు డ్రామాలు ఆడిందని, 75 ఏళ్ల వయస్సున్న వృద్ధుడిని ఉపయోగించుకుని డ్రామాలు చేసిందని నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యక్తిగత సంబంధాలు, సాంప్రదాయాలతో ఇలాంటి చెలగాటాలు ఆడవద్దని, సోషల్ మీడియా రీల్స్ కోసం ఏ స్థాయికైనా దిగజారడం సమాజానికి చేటని నెటిజన్లు తీవ్రస్థాయిలో రీనా రాజ్‌పుత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.




