Optical Illusion: "మీ మెదడుకు పదును పెట్టే పజిల్!".. ఈ 4 గ్లాసుల్లో దేనిలో ఎక్కువ నీరుందో కనిపెట్టగలరా?

Optical Illusion: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్‌లో నాలుగు వాటర్ గ్లాసులు ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 11 Nov 2026 12:24 PM IST
Optical Illusion
X

Optical Illusion: "మీ మెదడుకు పదును పెట్టే పజిల్!".. ఈ 4 గ్లాసుల్లో దేనిలో ఎక్కువ నీరుందో కనిపెట్టగలరా?

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కేవలం కళ్లకు మాత్రమే కాకుండా, మెదడుకు కూడా మంచి వ్యాయామాన్ని ఇస్తాయి. మన ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అయ్యే ఇలాంటి కొత్త సవాళ్లను జనాలు ఛాలెంజ్‌గా తీసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పజిల్స్ కేవలం కాలక్షేపమే కాకుండా, నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను లాజికప్‌గా పరిష్కరించుకునే విధానంలోనూ కొత్త మెలకువలను నేర్పుతాయి.

వైరల్ చిత్రంలో ఏముంది?

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో వరుసగా నాలుగు వాటర్ గ్లాసులు ఉన్నాయి. అయితే ఆ గ్లాసులలో విభిన్న వస్తువులు ఉంచారు. ఒక గ్లాసులో కత్తెర మరో గ్లాసులో పిన్నులు ఇంకో గ్లాసులో ఎరేజర్ చివరి గ్లాసులో గడియారం ఉన్నాయి.

ఇక్కడ నెటిజన్లకు ఇచ్చిన టాస్క్ ఏమిటంటే.. ఈ నాలుగు గ్లాసులలో ఏ గ్లాసులో ఎక్కువ నీరు ఉందో కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి. కొంచెం లాజిక్‌గా ఆలోచిస్తే ఈ సవాల్‌ను సులభంగా ఛేదించవచ్చు.

సమాధానం ఇదే..

ఇచ్చిన సమయంలో సరైన సమాధానాన్ని కనిపెట్టిన వారు అభినందనీయులు. ఒకవేళ కనిపెట్టలేకపోతే అసలు లాజిక్ ఏంటంటే.. అక్కడున్న నాలుగు గ్లాసుల్లో గ్లాస్‌-B లోనే ఎక్కువ నీరు ఉంది. ఎందుకంటే, మిగతా గ్లాసుల్లో ఉన్న వస్తువులతో (కత్తెర, పిన్నులు, గడియారం) పోలిస్తే B గ్లాసులోని వస్తువు (ఎరేజర్) పరిమాణం చాలా చిన్నది. వస్తువు పరిమాణం చిన్నదిగా ఉన్నప్పుడు నీటి స్థానభ్రంశం తక్కువగా జరిగి, ఆ గ్లాసులోనే ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.