Viral: నెలకు రూ. 2.2 లక్షల జీతం.! అయినా చాలట్లేదట.. ఈ కపుల్ బడ్జెట్ చూస్తే షాకే..
Viral: నెలకు ఏకంగా రూ. 2.2 లక్షల భారీ ఆదాయం వస్తున్నా, ఆ డబ్బు తమకు ఏమాత్రం సరిపోవడం లేదంటూ ముంబైకి చెందిన ఓ జంట పెట్టిన పోస్ట్..
Viral: నెలకు రూ. 2.2 లక్షల జీతం.! అయినా చాలట్లేదట.. ఈ కపుల్ బడ్జెట్ చూస్తే షాకే..
Viral: సాధారణంగా నెలకు ఓ యాభై వేల రూపాయల జీతం వస్తేనే బతుకు బండి సాఫీగా సాగిపోతుందని సగటు మధ్యతరగతి వాళ్లు భావిస్తుంటారు. అలాంటిది నెలకు రూ. 2 లక్షలకు పైగా ఆదాయం ఉంటే ఇంకెంత లగ్జరీగా బతకొచ్చు అనుకుంటారు. కానీ, ముంబై లాంటి మహానగరాల్లో ఆ డబ్బు ఏ మూలకూ చాలదని నిరూపించే ఓ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెలకు రూ. 2.2 లక్షలు సంపాదిస్తున్నా తమకు చేతిలో ఏమీ మిగలడం లేదని ఓ జంట పంచుకున్న బడ్జెట్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో నివసిస్తున్న ఒక జంట తమ నెలవారీ ఖర్చులకు సంబంధించిన బడ్జెట్ బ్రేకప్‌ను ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ దంపతులిద్దరూ కలిసి నెలకు సంపాదించే మొత్తం ఆదాయం రూ. 2.2 లక్షలు. కానీ, ఇంటి అద్దెలు, ఈఎంఐలు, కరెంటు బిల్లులు, కిరాణా ఖర్చులు, పనివాళ్ల జీతాలు, బయట ఫుడ్, వారాంతపు విహారయాత్రలు ఇలా అన్ని ఖర్చులూ పోను నెలాఖరుకు సేవింగ్స్ ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో భవిష్యత్తు కోసం పొదుపు చేయలేకపోతున్నామని తమ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ జంట బడ్జెట్ లెక్కలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ముంబై, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయిందని, భారీగా అద్దెలు కట్టలేక ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కామెంట్లు చేస్తూ.. కొందరు ఆ జంటకు మద్దతు తెలిపారు.
మరికొందరు మాత్రం ఆ జంట ఆర్థిక ప్రణాళికను తప్పుబడుతున్నారు. "నెలకి 2.2 లక్షలు అంటే సామాన్యమైన విషయం కాదు.. అది మీ జీతాల తప్పు కాదు, మీ లగ్జరీ లైఫ్‌స్టైల్ తప్పు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే నెలకు లక్ష రూపాయలు ఈజీగా దాచుకోవచ్చు" అంటూ చురకలు అంటిస్తున్నారు.




