Viral Video: డ్రెస్సులు కాదు డబ్బులూ డిస్కౌంటే.. రూ. 4 వేలు డ్రా చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
Viral Video: ఏటీఎంకి వెళ్లి డబ్బులు డ్రా చేస్తే.. మనం ఎంటర్ చేసినంత రాకుండా తక్కువ వస్తే ఎలా ఉంటుంది.? పైగా వచ్చిన దాంట్లో చిరిగిన నోట్లు ఉంటే ఎంత కోపం వస్తుందో ఊహించుకోండి.
Viral Video: డ్రెస్సులు కాదు డబ్బులూ డిస్కౌంటే.. రూ. 4 వేలు డ్రా చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
Viral Video: డిజిటల్ ఇండియా కాలంలో ఏటీఎంలు కూడా కొత్త రకం 'డిస్కౌంట్లు' ఇస్తున్నాయని నెటిజన్లు సెటైర్లు వేసేలా ఓ వింత ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్రలోని నాలోసోపారాలో ఓ ఏటీఎం కస్టమర్‌కు చుక్కలు చూపించింది. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసిన ఒక వ్యక్తికి ఏకంగా రూ. 400 తక్కువగా రావడం, పైగా వచ్చిన నోట్లలో ఒకటి పూర్తిగా చిరిగిపోయి ఉండటంతో సదరు కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలోని నాలోసోపారా పరిధిలో గాలా నగర్ ప్రాంతంలో ఉన్న ఓ హిటాచీ యూపీఐ ఏటీఎంలో ఒక వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. అతడు యూపీఐ ఆప్షన్ ఉపయోగించి రూ. 4 వేలు విత్‌డ్రా చేసేందుకు మెషిన్‌లో ఎంటర్ చేశాడు. మెషిన్ నుంచి డబ్బులు బయటకు వచ్చిన తర్వాత వాటిని లెక్కపెట్టి చూసుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తనకు రూ. 4 వేలు రావాల్సి ఉండగా, కేవలం రూ. 3600 మాత్రమే ఏటీఎం నుంచి బయటకు వచ్చాయి.
అంతేకాకుండా, వచ్చిన రూ. 3600 కూడా సరిగ్గా ఉన్నాయా అంటే అదీ లేదు. ఆ నోట్లలో ఏకంగా ఒక రూ. 200 నోటు పూర్తిగా చిరిగిపోయి ఉంది. కస్టమర్‌కు మొత్తం మీద రూ. 400 నగదు తక్కువ రావడంతో పాటు చిరిగిన నోటు కూడా రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు.
వెంటనే సదరు కస్టమర్ ఆ ఏటీఎం సెంటర్‌లోనే జరిగిన మోసాన్ని వివరిస్తూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. "డిజిటల్ ఇండియా కాలంలో ఏటీఎంల కొత్త డిస్కౌంట్ ఆఫర్ ఇదేనా?" అంటూ ఏటీఎం నిర్వహణపై, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.




