Viral Video: ప్యాంట్లు, నోళ్లలో మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు.. పోలీసుల తీరుపై నెట్టింట రచ్చ.!
Viral Video: యూపీ కానిస్టేబుల్ పరీక్షల నిర్వహణలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
Viral Video: ప్యాంట్లు, నోళ్లలో మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు.. పోలీసుల తీరుపై నెట్టింట రచ్చ.!
Viral Video: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా అరికట్టేందుకు పోలీసులు శృతిమించిన తనిఖీలు చేపట్టారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. యూపీలో గతంలో జరిగిన ఓ పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి ఏకంగా తన అండర్ వేర్‌లోనే మొబైల్ ఫోన్‌ను దాచిపెట్టి లోపలికి తీసుకురావడంతో పోలీసులు.. జూన్ 8 నుంచి జూన్ 10 మధ్య జరిగిన కానిస్టేబుల్ పరీక్షలకు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. అయితే ఆ సమయంలో వాళ్లు చేసిన చెకింగ్ విధానం వివాదాస్పదంగా మారింది. మెటల్ డిటెక్టర్‌ను నేరుగా అబ్బాయిల ప్యాంట్ల లోపల పెట్టి చెక్ చేశారు. అంతేకాకుండా, ఒకరి ప్యాంట్లో పెట్టిన అదే డిటెక్టర్‌ను తీసుకెళ్లి ఇతర అభ్యర్థుల నోళ్లలో కూడా పెట్టి చెక్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ప్రస్తుతం ఈ వింత తనిఖీలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ప్రొటోకాల్ పేరిట విద్యార్థులను బహిరంగంగా ఇలా ఇబ్బంది పెట్టడమేంటని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాపీయింగ్ అరికట్టడానికి ఇలాంటి అసభ్యకరమైన విధానాలు అవలంబించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.




