Viral Video: కూతురిపై తండ్రి వెలకట్టలేని ప్రేమ.! ఈ సృష్టిలో సాటి మరొకటి లేదు..

Viral Video: బిడ్డలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు ఎప్పుడూ చిన్నపిల్లలే అని నిరూపించే ఒక హృదయవిదారక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెరీర్ కోసం దూరంగా వెళ్తున్న కూతురికి ఒక తండ్రి ప్రేమతో డబ్బులు ఇస్తున్న ఈ ఎమోషనల్ ఘటన ఇక్కడ తెలుసుకోండి.

Ravi
By Ravi
Published on: 5 July 2026 7:33 PM IST
Viral Video
X

Viral Video: కూతురిపై తండ్రి వెలకట్టలేని ప్రేమ.! ఈ సృష్టిలో సాటి మరొకటి లేదు..

Viral Video: బిడ్డలు ఎంత ఎదిగినా, ఎంత ఉన్నత స్థానాలకు చేరినా తల్లిదండ్రులకు మాత్రం వారు ఎప్పుడూ చిన్నపిల్లలే. అందులోనూ ఆడపిల్లలంటే తండ్రులకు ఉండే విపరీతమైన ప్రేమ, అనురాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. సరిగ్గా ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచే ఒక క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి హృదయాలను హత్తుకుంటోంది.

ఒక యువతి తన కెరీర్ కోసం తల్లిదండ్రులను వదిలి వేరే ఊరు వెళ్తోంది. ఆ సమయంలో ఆమెకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన తండ్రి ఎమోషనల్ అయ్యారు. తన బిడ్డకు అక్కడ ఎలాంటి ఇబ్బంది రావొద్దనే ఉద్దేశ్యంతో ఆయన జేబులోంచి కొంత డబ్బు తీసి ఆమెకు ఇవ్వబోయారు.

అప్పటికే తన అకౌంట్‌లో, ఫోన్‌పేలో డబ్బులు ఉన్నాయని ఆ కూతురు చెప్పింది. అయినా సరే ఆ తండ్రి వినకుండా, ప్రయాణంలో లేదా అక్కడ ఏదైనా అవసరాలకు చేతి ఖర్చులకు కచ్చితంగా ఉపయోగపడతాయంటూ మరింత క్యాష్ తీసి ఆమె చేతిలో బలవంతంగా పెట్టారు.

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ ఎంత పెరిగినా సరే, కన్నవారికి మాత్రం పిల్లల చేతిలో డబ్బులు పెడితేనే ఆ తృప్తి వేరు. కూతురిపై ఆ తండ్రి చూపిస్తున్న ఈ వెలకట్టలేని ప్రేమను చూసి నెటిజన్లు ఫుల్ ఫిదా అవుతున్నారు. తండ్రి ప్రేమకు ఈ సృష్టిలో సాటి మరొకటి లేదంటూ కామెంట్ల రూపంలో తమ ఎమోషన్స్ పంచుకుంటున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story