Viral Video: ఫ్రీ రైడ్ ఇవ్వమని బెదిరించిన హోం గార్డు.. కట్ చేస్తే.. క్షణాల్లో సీన్ రివర్స్..

Viral Video: ఫ్రీగా ఆటో ఎక్కనివ్వలేదని ఓ ఆటో డ్రైవర్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన హోంగార్డ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత జరిగిందిదే.

Ravi
By Ravi
Published on: 27 Jun 2026 12:47 PM IST
Viral Video
X

Viral Video: ఫ్రీ రైడ్ ఇవ్వమని బెదిరించిన హోం గార్డు.. కట్ చేస్తే.. క్షణాల్లో సీన్ రివర్స్..

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ అన్యాయం జరిగినా క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది. తాజాగా గురుగ్రామ్‌లో ఓ హోంగార్డ్ చేసిన నిర్వాకం వీడియో రూపంలో బయటపడటంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఫ్రీగా ప్రయాణించడానికి నిరాకరించిన ఓ ఆటో డ్రైవర్‌పై హోంగార్డ్ బూతులతో రెచ్చిపోయిన తీరు నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో ఓ హోంగార్డ్ డ్యూటీ ముగించుకుని వెళ్లే క్రమంలో ఒక ఆటో ఎక్కాడు. తాను పోలీస్ డిపార్ట్‌మెంట్ కాబట్టి తనకు ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించాలని డ్రైవర్‌ను డిమాండ్ చేశాడు. అందుకు ఆ ఆటో డ్రైవర్ ససేమిరా అనడంతో ఆ హోంగార్డ్ తీవ్ర స్థాయికి కోపం తెచ్చుకున్నాడు. నడిరోడ్డుపై ఆటో ఆపి, డ్రైవర్‌ను ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ దాడి చేయడానికి కూడా ప్రయత్నించాడు. ఈ తతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసుల దృష్టికి వెళ్ళింది. సామాన్యులను రక్షించాల్సిన రక్షక భటుడే ఇలా రౌడీలా ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి, ఆ హోంగార్డ్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపించిన ఈ చర్యను ప్రస్తుతం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story