Viral Video: ఐస్‌క్రీమ్ ఇలా కూడా అందుకుంటారా బ్రో.! దెబ్బకు ఆస్పత్రి బెడ్డు ఎక్కేశావ్..

Viral Video: ఐస్‌క్రీమ్ కొనేందుకు కిందకు వెళ్లడం బద్ధకించి ఏకంగా మొదటి అంతస్తు బాల్కనీ నుంచి కిందకు వంగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు.

Ravi
By Ravi
Published on: 27 Jun 2026 3:43 PM IST
Viral Video
X

Viral Video: ఐస్‌క్రీమ్ ఇలా కూడా అందుకుంటారా బ్రో.! దెబ్బకు ఆస్పత్రి బెడ్డు ఎక్కేశావ్..

Viral Video: లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన కొందరు చిన్న చిన్న పనులకు కూడా విపరీతమైన బద్ధకాన్ని ప్రదర్శిస్తుంటారు. ఏదైనా వస్తువు కావాలంటే నేరుగా వెళ్లి తెచ్చుకోకుండా షార్ట్‌కట్స్ వెతుకుంటారు. ఇలాంటి బద్ధకమే ఓ వ్యక్తి పాలిట శాపంగా మారింది. ఐస్‌క్రీమ్ తినాలన్న కోరిక అతడిని నేరుగా ఆసుపత్రి పాలు చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోన్‌భద్ర జిల్లాలో జరిగిన ఈ విచిత్రమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. సోన్‌భద్ర జిల్లా రేణుకూట్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంటి మొదటి అంతస్తు బాల్కనీలో నిల్చున్నాడు. ఆ సమయంలో కింద రోడ్డుపై ఐస్‌క్రీమ్ విక్రయించే వ్యక్తి వెళ్తుండటం చూసి అతన్ని ఆపాడు. ఐస్‌క్రీమ్ తీసుకోవడానికి మెట్లు దిగి కిందకు వెళ్లాల్సిన ఆ వ్యక్తికి బద్ధకం అడ్డువచ్చింది. దీంతో పైనుంచే ఐస్‌క్రీమ్ ఇవ్వాలని అమ్మేవాడిని కోరాడు. అతడు కిందనుంచి చేతులు పైకెత్తి ఐస్‌క్రీమ్ అందిస్తుండగా, ఈ వ్యక్తి బాల్కనీ అంచున నిలబడి అమాంతం కిందకు వంగి దానిని అందుకునే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో ఒక్కసారిగా అతడి బ్యాలెన్స్ తప్పిపోయింది. దీంతో నేరుగా ఫస్ట్ ఫ్లోర్ పైనుంచి కింద రోడ్డుపై పడిపోయాడు. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని సోన్‌భద్ర పోలీసులు అధికారికంగా వెల్లడించారు. బద్ధకంతో ఇలాంటి షార్ట్‌కట్స్ వాడితే ప్రాణాలకే ప్రమాదం అని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story