Viral Video: డస్ట్ బిన్‌తో కూలర్.. నీ ఐడియా అదుర్స్ భయ్యా..!

Viral Video: సోషల్ మీడియాలో ఒక వినూత్నమైన దేశీ జుగాడ్ (Desi Jugaad) వీడియో తెగ వైరల్ అవుతోంది.

Arun Chilukuri
Updated on: 2 Jun 2026 5:00 PM IST
Viral Video
X

Viral Video: డస్ట్ బిన్‌తో కూలర్.. నీ ఐడియా అదుర్స్ భయ్యా..!

Viral Video: సాధారణంగా ఎండకాలం వచ్చిందంటే ఉక్కపోత తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. దీంతో మార్కెట్లో దొరికే రకరకాల బ్రాండెడ్ కంపెనీల కూలర్లు, ఏసీలను కొనుగోలు చేయడానికి జనాలు క్యూ కడుతుంటారు. కానీ, కొందరికి ఉండే క్రియేటివిటీ, టాలెంట్‌తో మార్కెట్ వస్తువులతో పనిలేకుండా ఇంట్లోనే అద్భుతాలు సృష్టిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన వినూత్నమైన ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పారేసే డస్ట్‌బిన్‌తో (చెత్తబుట్ట) ఆ వ్యక్తి ఏకంగా ఎయిర్ కూలర్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోను గమనిస్తే.. ఒక వ్యక్తి పెద్ద ప్లాస్టిక్ డస్ట్‌బిన్‌ను తీసుకున్నాడు. దాన్ని అచ్చం కూలర్ బాడీలా మార్చడానికి నాలుగు వైపులా పద్ధతిగా కట్ చేశాడు. అందులో మూడు వైపులా కూలర్లకు వాడే గడ్డిని (Cooling Pads) అమర్చాడు. ఆ గడ్డి కిందపడిపోకుండా సపోర్టుగా ఒక ప్లాస్టిక్ మెష్ వలను అమర్చి పక్కాగా డిజైన్ చేశాడు. లోపల మోటార్, పైన ఫ్యాన్ సెట్ చేయడంతో ఫైనల్‌గా అది అచ్చం మార్కెట్లో దొరికే కూలర్‌లా మారిపోయింది. స్విచ్ ఆన్ చేయగానే చల్లటి గాలిని ఇవ్వడం ప్రారంభించింది.

ఈ వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియోను @RealTofanOjha అనే యూజర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ 'దేశీ జుగాడ్' (Desi Jugaad) వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక నెటిజన్ ‘ఓ మై గాడ్.. డస్ట్‌బిన్‌ని ఇలా కూడా వాడుకోవచ్చా? నేను చూడటం ఇదే మొదటిసారి’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మరో నెటిజన్ ‘ఇలాంటి అద్భుతమైన, మైండ్ బ్లోయింగ్ ఐడియాలు కేవలం మన ఇండియన్స్‌కే వస్తాయి’’ అని గర్వంగా కామెంట్ పెట్టాడు. ఇంకొకరు ‘చెత్త బుట్ట అని తక్కువ అంచనా వేసి తీసేయకండి.. అది ఏసీ రేంజ్ చల్ల చల్లని గాలినిస్తుంది’ అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. తక్కువ ఖర్చుతో కూలర్ కావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఐడియా అంటూ మరికొందరు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story