Viral Video: ఇదేందయ్యా జోరు వర్షంలో మొక్కలకు నీళ్లు.. నెట్టింట వైరల్ వీడియో

Viral Video: పుణేలో మాత్రం మున్సిపల్ సిబ్బంది ఏకంగా జోరు వర్షంలో ట్యాంకర్లు పెట్టి మొక్కలకు నీళ్లు పడుతున్న ఫన్నీ, షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Ravi
By Ravi
Published on: 5 July 2026 12:34 PM IST
Viral Video
X

Viral Video: ఇదేందయ్యా జోరు వర్షంలో మొక్కలకు నీళ్లు.. నెట్టింట వైరల్ వీడియో

Viral Video: సాధారణంగా ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా ఉండటానికి ఎవరైనా ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తుంటారు. కానీ, భారీ వర్షం పడుతున్నప్పుడు కూడా ట్యాంకర్లు పెట్టి మరీ రోడ్డు డివైడర్ల మధ్య ఉన్న మొక్కలకు నీళ్లు పడుతున్న విచిత్రమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. జోరు వర్షంలో మున్సిపల్ సిబ్బంది పడుతున్న ఈ శ్రమకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వింత ఘటన మహారాష్ట్రలోని పుణే నగరంలో జరిగింది. ఒకవైపు భారీ వర్షం కురుస్తుండగా, రోడ్డు మధ్యలో ఉన్న మొక్కలకు పుణే మున్సిపల్ సిబ్బంది వాటర్ ట్యాంకర్ ద్వారా పైపులతో నీళ్లు పడుతూ కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి, ప్రజలు కట్టే పన్నుల సొమ్మును ఎలా వృథా చేస్తున్నారో చెప్పడానికి ఈ దృశ్యమే నిదర్శనమని ఫైర్ అవుతున్నారు.

కనీస ఇంగితజ్ఞానం లేకుండా కురుస్తున్న వర్షంలో మొక్కలకు నీళ్లు పోయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై సెటైర్లు వేస్తున్నారు. "భారీ వర్షం పడుతున్నా సరే ఆ మున్సిపల్ సిబ్బంది తమ విధి నిర్వహణను, బాధ్యతను ఏమాత్రం మరువలేదు, వారి డెడికేషన్ వేరే లెవల్" అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ అధికారుల తీరును చూసి జనాలు నవ్వుకుంటున్నారు.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story