Viral Video: చేపలు కాదు.. ఏకంగా పామునే నమిలేసింది.. కొంగ వేట స్టైల్ చూస్తే మైండ్ బ్లాకే!
Viral Video: సోషల్ మీడియాలో ఒక అరుదైన వైల్డ్‌లైఫ్ వీడియో వైరల్‌గా మారింది.
Viral Video: చేపలు కాదు.. ఏకంగా పామునే నమిలేసింది.. కొంగ వేట స్టైల్ చూస్తే మైండ్ బ్లాకే!
Viral Video: జంతు ప్రపంచంలో వేటాడే వ్యూహాలు ఎప్పుడూ విభిన్నంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ముఖ్యంగా పక్షులు తమ ఆహారాన్ని పట్టుకునే సమయంలో ప్రదర్శించే చాకచక్యం వైల్డ్‌లైఫ్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అరుదైన వీడియో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. ఒక పర్పుల్ హెరాన్ (కొంగ జాతికి చెందిన పక్షి) బతికున్న పాముతో ప్రాణాంతక ఆట ఆడుతూ, ఆపై దాన్ని అల్పాహారంగా మార్చుకున్న దృశ్యం కెమెరాకు చిక్కింది.
సాధారణంగా కొంగలు అనగానే చెరువుల్లో, నదుల్లో నిశ్శబ్దంగా ఉంటూ చేపలు, కప్పలను వేటాడటం మనకు తెలుసు. కానీ ఈ పర్పుల్ హెరాన్ మాత్రం ఏకంగా ఒక పామునే టార్గెట్ చేసింది. అయితే, పామును నోట చిక్కించుకున్న వెంటనే మింగేయకుండా దాంతో కాసేపు ఆడుకుంది. తన పొడవైన ముక్కుతో ఆ పామును గాల్లోకి ఎగరేస్తూ, కింద పడకుండా మళ్లీ అంతే వేగంతో నోటితో పట్టుకుంటూ క్రూరమైన విన్యాసం (Tossing) చేసింది.
వీడియోలో చూసినట్లుగా.. కొంగ గాల్లోకి విసిరిన ప్రతిసారీ ఆ పాము ప్రాణభయంతో మెలికలు తిరుగుతూ ఎలాగైనా తప్పించుకోవాలని చూసింది. కానీ, ఆ కొంగ దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, క్షణాల వ్యవధిలో మళ్లీ పట్టుకుని ఒకే ఉదుటన నమిలి మింగేసింది. అయితే, పక్షులు ఇలా ఎందుకు చేస్తాయనే దానికి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు, నిపుణులు ఆసక్తికర కారణం చెబుతున్నారు. కొన్నిసార్లు వేటాడిన జీవిని పూర్తిగా చంపడానికి లేదా అది గొంతులో అడ్డం పడకుండా సులభంగా మింగడానికి వీలుగా పక్షులు తమ ఆహారాన్ని ఇలా గాల్లోకి ఎగరేసి అడ్జస్ట్ చేసుకుంటాయని అంటున్నారు.
‘ది టాసింగ్ బై పర్పుల్ హెరాన్’ (The tossing by purple heron) అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. లక్షలాది వ్యూస్, వేలాది లైకులతో దూసుకుపోతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ప్రకృతిలో వేట ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియోనే సాక్ష్యం" అని ఒకరు కామెంట్ చేయగా.. "జీవితంలో ఇలాంటి అరుదైన దృశ్యాన్ని ఒక్కసారైనా కెమెరాలో బంధించడం నిజంగా అద్భుతం" అంటూ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.




