Viral Video: సరదా కోసం బీచ్‌కు వెళ్లాడు.. కట్ చేస్తే.. క్షణాల్లో కొట్టుకుపోయాడు!
Viral Video: సరదా కోసం చేసే చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదికి ఎలా వస్తుందో చెప్పే షాకింగ్ సంఘటన గోవాలో చోటు చేసుకుంది.
Viral Video: సరదా కోసం బీచ్‌కు వెళ్లాడు.. కట్ చేస్తే.. క్షణాల్లో కొట్టుకుపోయాడు!
Viral Video: సెలవులను ఆస్వాదించేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం సహజం. అయితే అక్కడ సరదా కోసం చేసే కొన్ని పిచ్చి పనులు ఒక్కోసారి ప్రాణాలు తీస్తాయనేందుకు ఈ వీడియోనే ప్రత్యక్ష నిదర్శనం. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం లేదా మంచి ఫోటోలు దిగాలనే ఉత్సాహంలో ప్రమాదం పొంచి ఉందని తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. గోవాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాగా బీచ్‌లో జరిగిన ఓ విషాద ఘటన ప్రస్తుతం నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన 33 ఏళ్ల టూరిస్ట్ గోవా ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ ఫోటోలకు పోజులిచ్చేందుకు బాఘా బీచ్‌లోని ప్రమాదకరమైన బండరాళ్లపైకి ఎక్కి కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉద్ధృతంగా దూసుకొచ్చిన అల తాకిడికి అతడు బ్యాలెన్స్ తప్పి నేరుగా నీటిలో పడిపోయాడు. నీటిలో పడిన ఆ వ్యక్తి తిరిగి ప్రాణాలతో ఒడ్డుకు చేరేందుకు ఎంతో తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అలల ముందు అతడి పోరాటం ఏమాత్రం ఫలించలేదు. చూస్తుండగానే కేవలం క్షణాల వ్యవధిలో నీటిలో కొట్టుకుపోయి మరణించాడు.
ఈ హృదయ విదారక ఘటన పర్యాటకులకు ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటిది. సముద్రం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి రాళ్లపైకి ఎక్కడం, సెల్ఫీల కోసం అంచుల వద్దకు వెళ్లడం మానుకోవాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. టూర్లకు వెళ్లినప్పుడు ఎప్పుడూ అత్యంత అప్రమత్తంగా ఉంటూ, 'స్టే సేఫ్' నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.




