Viral Video: అత్యాశకు పోతే ఇలాగే ఉంటుంది: రైలు దిగి మామిడి పండ్ల దొంగతనం.. ఓనర్ ఎంట్రీతో సీన్ రివర్స్..
Viral Video: సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వైరల్ వీడియో నెటిజన్లను నవ్విస్తోంది. రైలు ఆగగానే పక్కనే ఉన్న తోటలో మామిడి పండ్లు దొంగిలించడానికి వెళ్లిన ఒక ప్రయాణికుడికి, తోట యజమాని కర్రతో గట్టిగా బుద్ధి చెప్పాడు.
Viral Video: అత్యాశకు పోతే ఇలాగే ఉంటుంది: రైలు దిగి మామిడి పండ్ల దొంగతనం.. ఓనర్ ఎంట్రీతో సీన్ రివర్స్..
Viral Video: ఇంటర్నెట్లో రోజుకో విచిత్రమైన వీడియో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా దొంగతనాలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యే దొంగల వీడియోలు నెటిజన్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఉచితంగా మామిడి పండ్లు తినాలని ఆశపడ్డ ఒక రైలు ప్రయాణికుడికి, తోట యజమాని జీవితంలో మర్చిపోలేని 'రుచి' చూపించాడు.
వైరల్ వీడియో వివరాల ప్రకారం.. ఒక ప్యాసింజర్ రైలు సిగ్నల్ కోసమో లేదా మరేదైనా కారణంతో ట్రాక్‌పై కాసేపు ఆగింది. రైలు అలా ఆగడమే ఆలస్యం.. అందులోని ఒక ప్రయాణికుడికి కిటికీలోంచి పక్కనే ఉన్న మామిడి తోట కనిపించింది. చుట్టుపక్కల ఎవరూ లేరని భావించిన ఆ కిలాడీ ప్రయాణికుడు, చటుక్కున రైలు కిందకు దిగాడు. నేరుగా తోటలోకి దూరి, చెట్టుకున్న కొన్ని మామిడి పండ్లను కోసుకున్నాడు. తన ప్లాన్ సక్సెస్ అయిందని సంబరపడుతూ, పండ్లను పట్టుకుని తిరిగి రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు.
అయితే, ఆ ప్రయాణికుడు సీన్ లోకి వచ్చేటప్పటికే.. ఇదంతా గమనిస్తున్న తోట యజమాని సైలెంట్‌గా స్కెచ్ వేశాడు. ప్రయాణికుడు దొంగిలించిన మామిడి పండ్లతో రైలు ఎక్కుతున్న తరుణంలో.. ఓనర్ చేతిలో పెద్ద కర్ర పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చీ రావడంతోనే రైలు ఫుట్‌బోర్డ్‌పై ఎక్కుతున్న ఆ దొంగపై కర్రతో దెబ్బల వర్షం కురిపించాడు. రైలు కదులుతుండటం, గేటు దగ్గర ఇరుక్కుపోవడంతో ఆ ప్రయాణికుడికి తప్పించుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది. తోట యజమాని కొట్టిన దెబ్బలకు అక్కడే నరకం చూశాడు.
'రితేష్ కుష్వాహా' (Ritesh Kushwaha) అనే ఇన్స్టాగ్రామ్ ఐడీలో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఫ్రీగా మామిడి పండ్లు తినాలనుకున్న వాడికి గట్టి ప్రసాదమే దొరికింది" అని ఒకరు కామెంట్ చేయగా.. "ఈ దెబ్బ దెబ్బకి వాడు ఇక జీవితంలో మామిడి పండ్ల వైపు కన్నెత్తి కూడా చూడడు" అంటూ మరికొందరు నెటిజన్లు నవ్వుకుంటున్నారు.




