Viral: యూఎస్‌లో రూ. 85 వేలు, భారత్‌లో కేవలం రూ. 35 మాత్రమే.. ఈ యువతి పోస్టు చూస్తే మీరూ షాక్ అవుతారు!
Viral Video: అమెరికాలో రూ.85 వేలు పలికే ఒక క్యాన్సర్ మందు ధర ఇండియాలో కేవలం రూ.35కే దొరుకుతుందంటూ ఒక అమెరికన్ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Viral: యూఎస్‌లో రూ. 85 వేలు, భారత్‌లో కేవలం రూ. 35 మాత్రమే.. ఈ యువతి పోస్టు చూస్తే మీరూ షాక్ అవుతారు!
Viral Video: అమెరికాలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, అక్కడి హెల్త్‌కేర్ సిస్టమ్ ఎంత ఖరీదైనదో వివరిస్తూ ఒక అమెరికన్ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె అమెరికా, ఇండియాలోని వైద్య ఖర్చులను, మందుల ధరలను పోల్చుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
సదరు మహిళ తన ఆంటీకి క్యాన్సర్ ఉందని, ఆమె చికిత్స కోసం 'Revlimid' అనే మందును వాడుతున్నారని వివరించింది. అయితే, అమెరికాలో ఆ మందు ఒక్కో టాబ్లెట్ ధర ఏకంగా 900 డాలర్లు(అంటే సుమారుగా మన కరెన్సీలో రూ.85,000) పలుకుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అదే మందు ధర ఇండియాలో ఎంతుందో తెలుసుకుని తాను షాక్ అయ్యానని, ఇండియాలో ఆ టాబ్లెట్ కేవలం రూ.35కే లభిస్తోందని ఆమె తెలిపింది. అమెరికాలో మందుల పేరుతో ప్రజలను నిలువునా దోచేస్తున్నారని, కానీ ఇండియాలో మాత్రం ప్రజలకు చాలా తక్కువ ధరకే వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె ప్రశంసించింది.
ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్లు అమెరికా హెల్త్‌కేర్ సిస్టమ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అక్కడికి వెళ్లి మందులకు అంత భారీ మొత్తం ఖర్చుపెట్టే బదులు, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఇండియాకు వచ్చి ఆ మెడిసిన్స్ కొనుక్కోవడం చాలా మేలని పలువురు నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.




