Viral Video: మరీ ఇంత క్రేజీగా ఉన్నారేంట్రా బాబూ.. జూమ్ మీటింగ్‌లో జెన్ జీ అమ్మాయి ఏం చేసిందంటే
Viral Video: మారిన కాలంతో పాటు పని విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు ఆఫీసులకు వెళ్లి చేసిన పనులను ఇప్పుడు ఇంట్లో ఉండే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా జెన్‌జీ ఉద్యోగుల వర్క్ కల్చర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వైరల్‌గా మారిన జూమ్ కాల్ వీడియో
ఒక సాధారణ ఆఫీస్ ఆన్లైన్ మీటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఓ యువతి తన టీమ్ మీటింగ్‌లో పాల్గొంటూ, ముఖానికి గ్రీన్ కలర్ నీమ్ ఫేస్ మాస్క్ వేసుకుని కనిపించింది. ఈ సందర్భంగా ఈ యంగ్ ఎంప్లాయి AI ప్రోడక్ట్ ఐడియాస్ గురించి మాట్లాడింది. అయితే ఆశ్చర్యంగా ఆమె బాస్ ఆమెను ఆపలేదు.
అదే కాకుండా, ఆ మాస్క్ గురించి అడిగి, ఆసక్తిగా స్పందించాడు.
నెటిజన్లలో రెండు వర్గాలుగా చర్చ
ఈ వీడియోను కేవలం 24 గంటల్లోనే లక్ష మందికి పైగా వీక్షించారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇది ప్రొఫెషనల్ బిహేవియర్ కాదని, ఇలాంటి వాటి వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దవుతుందని, ఆఫీస్ కల్చర్ దెబ్బతింటుందని కామెంట్స్ చేశారు.
సపోర్ట్ కూడా లభిస్తోంది
ఇదిలా ఉంటే మరికొంత మంది మాత్రం ఈ వీడియోలో ఉన్న అమ్మాయికి మద్ధతు తెలుపుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం పని సరిగా చేస్తే ఇలాంటి చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు,
కరోనా తర్వాత వర్క్ కల్చర్ మారిపోయింది, వ్యక్తిగత జీవితం కొంత పని సమయంలో కనిపించడం సహజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మారుతున్న వర్క్ కల్చర్ – ఎక్కడ లైన్ డ్రా చేయాలి?
Gen Z ఉద్యోగులు కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. ఫార్మల్ డ్రెస్సింగ్ తగ్గించడం, మెంటల్ హెల్త్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, ఫ్లెక్సిబుల్ వర్క్ స్టైల్ వంటివి ఫాలో అవుతున్నారు. అయితే ఇది కంపెనీలకు కొత్త సవాల్‌గా మారింది.
స్వేచ్ఛ ఇవ్వాలా? లేక కఠిన నిబంధనలు పెట్టాలా? అనే ప్రశ్న ఎదురవుతోంది.