Viral Video: రైలులో సమోసా తింటున్నారా.! ఇది చూస్తే జన్మలో ట్రైన్ ఫుడ్ తినరు

Viral Video: రైలు ప్రయాణంలో వేడి వేడి సమోసాలు తినడం ఎవరికి ఇష్టం ఉండదు? కానీ, ఆ సమోసాలు అమ్మే వ్యక్తి కాళ్లు దేని మీద ఉన్నాయో చూస్తే.

Ravi
By Ravi
Published on: 27 May 2026 2:46 PM IST
Viral Video
X

Viral Video: రైలులో సమోసా తింటున్నారా.! ఇది చూస్తే జన్మలో ట్రైన్ ఫుడ్ తినరు

Viral Video: రైలు ప్రయాణం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కిటికీ పక్కన సీటు, ఆ చల్లటి గాలికి తోడుగా వచ్చే వేడి వేడి సమోసాలు. ట్రైన్ ఎక్కగానే "సమోసా.. వేడి సమోసా" అంటూ వచ్చే వ్యాపారులను చూడగానే మనసుకు ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. ఇంకేముంది, వెంటనే ఒకటి కొనుక్కుని ఆత్రంగా లాగించేస్తాం. కానీ, మీరు ఎంతో ఇష్టంగా కొనుక్కుని తినే ఆ సమోసాల వెనుక ఎంత ఘోరమైన నిజం దాగి ఉందో తెలిస్తే, ఇక జన్మలో ట్రైన్ ఫుడ్ వంక కన్నెత్తి కూడా చూడరు.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఒక రైలులో సమోసాలు అమ్మే వ్యాపారి చేసిన పాడు పని చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ షాకింగ్ వీడియోలో ఒక వ్యక్తి రైలు డోర్ దగ్గర, మురికిగా ఉన్న వాష్ బేసిన్ కింద నేలపై కూర్చుని ఉన్నాడు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఎవరితోనో తీరిగ్గా మాట్లాడుతూ.. తన కాళ్లను ఏకంగా ఆ సమోసాలు ఉన్న డబ్బాపైనే దర్జాగా పెట్టాడు! అంతేకాకుండా, అదే డబ్బాలోంచి సమోసాలు తీసి, ఏమీ ఎరగనట్టు ప్రయాణికులకు అమ్ముతున్నాడు. ఎంతో ఇష్టంగా మనం తినే ఆహారంపై, కాళ్లను పెట్టుకుని కూర్చోవడం చూస్తే.. ఎవరికైనా కడుపులో తిప్పేసి వాంతులు రావడం ఖాయం. ఇది చూసి ప్రతి ఒక్కరూ రైల్వే శాఖ పనితీరును, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నిజానికి ఇలాంటి దారుణమైన సంఘటనలు బయటపడటం మనకు ఇదే మొదటిసారి ఏమీ కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు నాసిరకం ఆహారం, పురుగులు పడిన వంటకాలు, కల్తీ నీళ్లు అమ్ముతూ పట్టుబడిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రయాణికుల ఆరోగ్యం పట్ల రైల్వే శాఖ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన కనీస అవసరం ఉందని అంటున్నారు. నిబంధనలు బేఖాతరు చేసే ఇలాంటి వారి లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story