Watermelon Viral Video : పుచ్చకాయలో విషమా.? వైరల్ వీడియోతో సోషల్ మీడియాలో మొదలైన టెన్షన్.!
Watermelon Viral Video : ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ తనేజా, తన 'Flying Beast' ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఒక వింత వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది..
Watermelon-Viral-Video
Watermelon Viral Video : ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ తనేజా, తన 'Flying Beast' ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఒక వింత వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. వేసవి కాలంలో చల్లగా తిందామని తెచ్చుకున్న పుచ్చకాయ నుండి విపరీతంగా నురుగు రావడం చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. "తర్బూజ్ మే నికాలా జెహర్" అనే టైటిల్‌తో వచ్చిన ఈ వ్లాగ్‌లో పుచ్చకాయ లోపలి నుండి ఆగకుండా తెల్లటి బురగ లాంటి నురుగు వస్తూనే ఉంది. అసలే పండ్ల సేఫ్టీ గురించి రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో, ఒక పాపులర్ క్రియేటర్ ఇలాంటి దృశ్యాలను చూపించడంతో ప్రజల్లో ఆందోళన ఒక్కసారిగా పెరిగిపోయింది.
అసలేం జరిగింది?
గౌరవ్ తనేజా భార్య రీతూ ఈ పుచ్చకాయను లోకల్ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఆ కాయ సైజు చాలా పెద్దదిగా ఉండటంతో అది ఫ్రిజ్‌లో పట్టలేదు, దాంతో దాన్ని కిచెన్ కౌంటర్‌పైనే రాత్రంతా వదిలేశారు. తెల్లారి చూసేసరికి ఆ పండు నుండి వింతగా నురుగు బయటకు రావడం మొదలైంది. గౌరవ్ తిరిగి వచ్చేసరికి కూడా ఆ బురగ రావడం ఆగకపోవడంతో ఇంట్లో వాళ్లంతా కంగారు పడ్డారు. సోపు నీళ్ల నురుగులాగా అది అలా వస్తూనే ఉండటం చూసి, ఇది కచ్చితంగా ఏదో కెమికల్ రియాక్షన్ అయి ఉంటుందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కెమికల్సా లేక వేడి ప్రభావమా?
ఈ వీడియో వైరల్ అవ్వగానే సోషల్ మీడియాలో రకరకాల వాదనలు మొదలయ్యాయి. పుచ్చకాయలు త్వరగా పండటానికి లేదా లోపల ఎర్రగా ఉండటానికి వ్యాపారులు ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇస్తున్నారని, వాటి వల్లే ఇలాంటి నురుగు వస్తుందని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. అయితే మరోవైపు సైంటిఫిక్ రీజన్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎండలు విపరీతంగా ఉండటం వల్ల పుచ్చకాయ లోపల ఉండే షుగర్స్ బాక్టీరియా వల్ల 'ఫెర్మెంటేషన్' (పులిసిపోవడం) ప్రక్రియకు గురవుతాయి. దీనివల్ల లోపల గ్యాస్ ఫామ్ అయ్యి ప్రెజర్ పెరగడం వల్ల ఇలా నురుగు బయటకు వస్తుంది. ముఖ్యంగా పండుకు చిన్న పగుళ్లు ఉన్నా లేదా అది లోపల పాడైపోయినా ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
పాత జ్ఞాపకాలు , భయాందోళనలు
ముంబైలో రీసెంట్ గా పుచ్చకాయ తిని ఒకే ఫ్యామిలీకి చెందిన వారు చనిపోయిన ఘటన అందరినీ భయపెట్టింది. ఆ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం పండులో ఎలుకల మందు లాంటి విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేలింది. అప్పటి నుండి జనం పండ్లు కొనాలంటేనే వణికిపోతున్నారు. ఇప్పుడు ఫ్లయింగ్ బీస్ట్ వీడియో కూడా తోడవడంతో ఈ భయం రెట్టింపు అయింది. "ఇండియన్ సమ్మర్ ఇప్పుడు ఎంత పవర్‌ఫుల్ అయిందంటే పుచ్చకాయలు కూడా తట్టుకోలేక లోపలే ఉడికిపోతున్నాయి" అని కొందరు ఫన్నీగా అన్నా కూడా, మెజారిటీ జనం మాత్రం ఫుడ్ సేఫ్టీ విషయంలో సీరియస్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పండ్లను కొనేటప్పుడు వాటిపై చిన్న హోల్స్ ఉన్నా లేదా వింతగా అనిపించినా అసలు కొనకపోవడమే మంచిదని ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తోంది. ఒకవేళ పుచ్చకాయ నుండి వింత వాసన వచ్చినా లేదా ఇలా నురుగు కనిపిస్తే అస్సలు టేస్ట్ చేయకూడదు. ముఖ్యంగా ఎండకాలంలో పండ్లను సరైన టెంపరేచర్ లో స్టోర్ చేయకపోతే అవి బ్యాక్టీరియాకు నిలయంగా మారి ప్రాణాంతకమవుతాయి. ఈ వీడియో ఇప్పుడు కేవలం ఒక వ్లాగ్ లా కాకుండా, వేసవిలో ఆహార పదార్థాల విషయంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో గుర్తు చేసే ఒక హెచ్చరికలా మారింది. మీ ఇంట్లో ఉన్న పుచ్చకాయను కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి మరి..




