Harassment: అమ్మాయే కదా ఏడిపించాడు.. కట్ చేస్తే గుండె ఆగినంత పనైంది.. !
Harassment: లేడీ పోలీస్ కానిస్టేబుల్‌ను సాధారణ మహిళగా భావించి అసభ్య చేష్టలకు దిగిన డెలివరీ బాయ్‌ను నడిరోడ్డుపై కాలర్ పట్టుకుని స్టేషన్‌కు లాక్కెళ్లిన కానిస్టేబుల్.
Harassment: అమ్మాయే కదా ఏడిపించాడు.. కట్ చేస్తే గుండె ఆగినంత పనైంది.. !
Lady Constable: పశ్చిమ బెంగాల్‌లోని ఖర్దాలో మహిళల రక్షణకు నిదర్శనంగా నిలిచే ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా కనిపించిన ఒక మహిళను సాధారణ వ్యక్తిగా భావించి, అసభ్య చేష్టలతో పైశాచిక ఆనందం పొందాలనుకున్న ఓ డెలివరీ ఏజెంట్‌కు ఊహించని షాక్ తగిలింది. తాను వేధింపులకు గురిచేస్తోంది ఒక సాధారణ మహిళను కాదు.. లేడీ సింగం లాంటి ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను అని తెలిసి సదరు ఆకతాయి గుండె ఆగినంత పనైంది.
ఖర్దా ప్రాంతంలో ఒక రోడ్డు పక్కన సదరు మహిళ నిల్చొని ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక డెలివరీ బాయ్, ఆమెను చూస్తూ అసభ్యకరమైన సైగలు చేయడం, వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించాడు. కొద్దిసేపు అతడి వికృత చేష్టలను గమనించిన ఆ మహిళ కోపంతో రగిలిపోయింది. అయితే, తాను అప్పుడు అఫీషియల్ యూనిఫాంలో లేకపోవడంతో ఆమెను ఒక సాధారణ అబలగా భావించి ఆ యువకుడు మరింత రెచ్చిపోయాడు.
కానీ, క్షణాల్లో సీన్ రివర్స్ అయింది. ఆమె నేరుగా ఆ యువకుడి వద్దకు వెళ్లి, నిలదీస్తూ గర్జించింది. మహిళలు కనిపిస్తే చాలు వేధించడమేనా మీ పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాను పోలీస్ కానిస్టేబుల్ అని అసలు గుర్తింపును బయటపెట్టింది. ఆమె పోలీస్ అని తెలియగానే ఆ డెలివరీ బాయ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఒక్కసారిగా భయంతో వణికిపోతూ.. తప్పైపోయింది మేడం, ఇంకెప్పుడూ ఇలా చేయను, దయచేసి విడిచిపెట్టండి అంటూ కాళ్ల బేరానికి వచ్చాడు, ప్రాధేయపడ్డాడు. కానీ, సమాజంలో మహిళలను వేధించే ఇలాంటి ఆకతాయిలకు బుద్ధి చెప్పాలనుకున్న ఆ లేడీ కానిస్టేబుల్ అస్సలు వెనక్కి తగ్గలేదు.
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆ యువకుడి కాలర్ పట్టుకుంది. ఏమాత్రం కనికరం చూపించకుండా, అక్కడి నుంచి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ వరకు అతడిని కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. అనంతరం ఆ లేడీ కానిస్టేబుల్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు ఖర్దా పోలీసులు సదరు ఆకతాయి డెలివరీ బాయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహిళల జోలికి వస్తే ఇలాంటి ట్రీట్‌మెంటే ఉంటుందని, ప్రతి మహిళా ఈ కానిస్టేబుల్ లాగే ధైర్యంగా తిరగబడాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.




