తగ్గేదేలే.! ఇండియాలో బేబీమూన్ ట్రెండ్.. అసలు ఇది ఏంటంటే.?

Babymoon: ప్రస్తుతం ఇండియాలో 'బేబీమూన్' ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. శిశువు జన్మించడానికి ముందు కాబోయే తల్లిదండ్రులు ప్రశాంతంగా గడపడానికి ప్లాన్ చేసే ఈ ప్రయాణం.

Ravi
By Ravi
Published on: 2 July 2026 6:14 PM IST
Babymoon
X

తగ్గేదేలే.! ఇండియాలో బేబీమూన్ ట్రెండ్.. అసలు ఇది ఏంటంటే.?

Babymoon: మారుతున్న కాలంలో ఆధునిక జీవనశైలికి అలవాటు పడుతున్న దంపతులు కొత్త కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు. పెళ్లయిన కొత్తలో జంటలు హనీమూన్‌కు వెళ్లడం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు భారతదేశంలో 'బేబీమూన్' అనే సరికొత్త సంస్కృతి విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది. విదేశాలలో ఎంతో పాపులర్ అయిన ఈ ట్రెండ్‌ను ప్రస్తుతం ఇండియాలోని దంపతులు కూడా పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు.

అసలు బేబీమూన్ అంటే ఏంటి?

శిశువు పుట్టకముందు కాబోయే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో క్వాలిటీ టైమ్ గడపడానికి వెళ్లే చిన్నపాటి ప్రయాణాన్నే 'బేబీమూన్' అని పిలుస్తారు.

దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:

ఒత్తిడి నివారణ: తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు దంపతులలో ఉండే మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

బంధం బలపడటం: బిడ్డ పుట్టిన తర్వాత బాధ్యతలతో జీవితం బిజీ అయిపోతుంది. అందుకే ఆ లోపే భార్యాభర్తలు ఇద్దరూ ప్రశాంతంగా గడుపుతూ తమ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపర్చుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది.

ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి?

గర్భధారణ సమయంలో ప్రయాణాలు చేయడం కాస్త సున్నితమైన విషయం. అందుకే బేబీమూన్ వెళ్లాలనుకునే వారు ప్రెగ్నెన్సీ వచ్చిన 14 నుంచి 28 వారాల మధ్య దీనిని ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వారాల మధ్య ప్రయాణం చేయడం వల్ల గర్భిణీలకు అలసట తక్కువగా ఉంటుంది. జర్నీ ఎంతో సౌకర్యంగా సాగుతుంది.

కాగా, బేబీమూన్ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు గర్భిణీలు కచ్చితంగా తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టరును సంప్రదించి, తగిన సలహాలు, అనుమతి తీసుకోవడం తప్పనిసరి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story