Mangoes: మామిడిపండ్లను ఏ సమయంలో తినడం మంచిది.? నిపుణులు ఏం చెప్పారంటే?

Mangoes: పండ్లలో రారాజు అయిన మామిడి పండు అంటే ఇష్టపడని వారుండరు. ఎన్నో పోషకాలు ఉండే ఈ పండ్లను ఏ సమయంలో పడితే ఆ సమయంలో తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

Ravi
By Ravi
Published on: 12 Jun 2026 9:45 PM IST
Mangoes
X

Mangoes: మామిడిపండ్లను ఏ సమయంలో తినడం మంచిది.? నిపుణులు ఏం చెప్పారంటే?

Mangoes: ఎండాకాలం రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నోరూరించే మామిడి పండ్లు. ఈ పండ్లలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ లాంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే, రుచిగా ఉన్నాయి కదా అని వీటిని ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మామిడి పండ్లను తినడానికి ఏది సరైన సమయం, ఏ సమయంలో తినకూడదు అనే విషయాలను తెలుసుకుందాం.

మామిడిపండ్లు ఏ సమయంలో తింటే మంచిది?

మామిడి పండ్లను తినడానికి పగటిపూట(ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు) అత్యుత్తమ సమయం. ఈ సమయంలో మన శరీర జీవక్రియ చురుకుగా ఉంటుంది. పగటిపూట శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మామిడి పండ్లలోని సహజ చక్కెరలు సులభంగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

ఏ సమయంలో అస్సలు తినకూడదంటే?

రాత్రిపూట వద్దు: రాత్రి సమయంలో శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల పండ్లు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ మందగించి కడుపులో గ్యాస్ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా వీటిని రాత్రి తినగానే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది.

పరగడుపున వద్దు: ఉదయం నిద్రలేవగానే, ఖాళీ కడుపుతో మామిడి పండ్లు అస్సలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

భోజనం తర్వాత వెంటనే వద్దు: చాలామంది అన్నం తిన్న వెంటనే స్వీట్ లాగా మామిడి పండ్లు తింటుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. భోజనానికి, పండు తినడానికి మధ్య కనీసం గంట గ్యాప్ ఉండటం మంచిది.

కాబట్టి, సరైన సమయంలో మితంగా మామిడి పండ్లను తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story