భార్య కాపురానికి రావడం లేదా.? భర్త ఎలాంటి కేసు పెట్టొచ్చంటే.? నిపుణులు చెప్పేది ఇదే

wife not coming: భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజం. అయితే చిన్నచిన్న గొడవలకే అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య, తిరిగి కాపురానికి రాకపోతే భర్త చట్టపరంగా ఏం చేయవచ్చు.?

Ravi
By Ravi
Published on: 13 Jun 2026 12:43 PM IST
wife not coming
X

భార్య కాపురానికి రావడం లేదా.? భర్త ఎలాంటి కేసు పెట్టొచ్చంటే.? నిపుణులు చెప్పేది ఇదే

wife not కింగ్ to matrimonial home: పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఏవో ఒక చిన్నపాటి గొడవలు, మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే కొందరు మహిళలు చిన్న గొడవలకే కోపంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంటారు. ఎంత బతిమాలినా, పెద్దల సమక్షంలో పంచాయితీలు చేసినా తిరిగి కాపురానికి రావడానికి ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో భార్యను తిరిగి తెచ్చుకోవడానికి భర్త చట్టపరంగా ఎలాంటి కేసులు పెట్టవచ్చు అనే దానిపై ప్రముఖ న్యాయవాది పుష్పలత పలు న్యాయ సలహాలు అందించారు.

కాపురానికి రాకపోతే భర్త ఏం చేయవచ్చు?

భార్య ఎలాంటి సరైన కారణం లేకుండా భర్తను వదిలేసి పుట్టింట్లో ఉండిపోతే, ఆమెను తిరిగి కాపురానికి తీసుకురావడానికి చట్టపరంగా భర్తకు హక్కు ఉంటుంది. దీనికోసం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం భర్త ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు.

దాంపత్య హక్కుల పునరుద్ధరణ: దీనినే 'రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్' అంటారు. అంటే వివాహ బంధాన్ని కొనసాగించడానికి, భార్య తన వద్దకు తిరిగి వచ్చేలా కోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేయాలని భర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించడం.

లీగల్ నోటీసు: కోర్టులో కేసు వేయడానికి ముందు, భర్త తన భార్యకు ఒక లీగల్ నోటీసు పంపించాలి. అందులో "మనం కలిసి ఉందాం, తిరిగి కాపురానికి రా" అని స్పష్టంగా అడగాలి. దానికి భార్య స్పందించకపోయినా, లేదా సరైన సమాధానం ఇవ్వకపోయినా అప్పుడు కోర్టులో సెక్షన్ 9 కింద పిటిషన్ వేయవచ్చు.

కోర్టు ఎలా విచారిస్తుంది?

భర్త సెక్షన్ 9 కింద కేసు వేసిన తర్వాత, కోర్టు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇస్తుంది.

భార్య ఎందుకు దూరంగా ఉంటుందో కోర్టుకు సరైన కారణం (ఉదాహరణకు: భర్త కొడుతున్నాడని, కట్నం వేధింపులు ఉన్నాయని, లేదా ఇతర అక్రమ సంబంధం లాంటివి) నిరూపించాల్సి ఉంటుంది.

ఒకవేళ భార్య చెప్పే కారణాలు సరైనవి కాకపోతే, లేదా ఎలాంటి కారణం లేకుండానే దూరంగా ఉంటున్నట్లు రుజువైతే.. తిరిగి భర్తతో కలిసి కాపురానికి వెళ్లాలని కోర్టు భార్యను ఆదేశిస్తుంది.

ఒకవేళ కోర్టు ఆదేశించిన తర్వాత కూడా భార్య కాపురానికి రాకపోతే, భవిష్యత్తులో విడాకులు తీసుకునేటప్పుడు భర్తకు ఈ సెక్షన్ 9 తీర్పు చాలా ఉపయోగపడుతుందని న్యాయ నిపుణులు వివరిస్తున్నారు. కాబట్టి కాపురానికి రాని భార్య విషయంలో భర్తలు చట్టబద్ధమైన మార్గాల ద్వారా న్యాయం పొందవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story