Daughter in law: కోడలు వింత మొక్కు.. 'నా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామీ' అంటూ

Daughter in law: అనంతపురం జిల్లా పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపులో ఒక వింత నోటు దొరికింది.

Naresh.k
Published on: 20 Jun 2026 11:20 AM IST
Daughter in law
X

Daughter in law: కోడలు వింత మొక్కు.. 'నా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామీ' అంటూ

Mother-in-Law: సాధారణంగా గుడికి వెళ్తే దేవుడిని ఏం కోరుకుంటారు? ఆయురారోగ్యాలు ఇవ్వమనో, ఐశ్వర్యం ప్రసాదించమనో, లేదా ఉద్యోగం, పెళ్లి కావాలనో కోరుకుంటారు. మహా అయితే కోరిక తీరితే హుండీలో కానుకలు వేస్తామని మొక్కుకుంటారు. కానీ, ఓ కోడలు మాత్రం దేవుడికి మైండ్ బ్లోయింగ్ రిక్వెస్ట్ పెట్టింది. ఎవరూ ఊహించని విధంగా.. తన అత్త చనిపోవాలంటూ రూ.20 నోటుపై రాసి మరీ దేవుడి హుండీలో వేసింది. ప్రస్తుతం ఈ వింత ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ విచిత్రమైన ఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో వెలుగుచూసింది. మండల పరిధిలోని పంపనూరు గ్రామంలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ప్రతి నెలా లాగే ఈసారి కూడా ఆలయ అధికారులు, పూజారులు కలిసి హుండీ డబ్బులను లెక్కిస్తున్నారు. నోట్ల కట్టలను వేరు చేస్తుండగా.. ఓ పూజారి కంటికి ఒక రూ.20 నోటు కాస్త వెరైటీగా కనిపించింది. దానిపై పెన్నుతో ఏదో రాసి ఉంది. ఏదో ఫోన్ నెంబరో, పేరో అనుకుని క్యాజువల్‌గా చదివిన పూజారికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి.

స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. ఆమె త్వరగా చనిపోయేలా చూడు స్వామీ..అంటూ ఒక కోడలు తన ఆవేదననంతా ఆ ఇరవై రూపాయల నోటుపై రాసి హుండీలో పడేసింది. అత్త పెట్టే టార్చర్ భరించలేక.. ఇక తన వల్ల కాదనుకుందో ఏమో గానీ.. డైరెక్ట్‌గా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే అర్జీ పెట్టేసుకుంది.

హుండీ లెక్కింపులో దొరికిన ఈ సెంటిమెంట్ నోటు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అమ్మా నీ ఆరాటం కూడదు.. దేవుడికి ఇరవై రూపాయల లంచం ఇచ్చి అంత పెద్ద స్కెచ్ వేస్తావా? అంటూ నవ్వుకుంటున్నారు. పాపం.. ఆ కోడలు అత్తగారి చేతిలో ఎంత నలిగిపోతే దేవుడికి ఇలాంటి వింత మొక్కు మొక్కుకుంటుంది? ఆమె బాధను కూడా అర్థం చేసుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అత్తాకోడళ్ల పంచాయితీలు సీరియల్స్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పడానికి ఈ రూ. 20 నోటు ఒక నిదర్శనంగా నిలిచింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story