Viral Video: షాకింగ్.. కప్పతో ఏడడుగులు నడిచిన యువతి!

Viral Video: సోషల్ మీడియాలో ఒక యువతి కప్పతో పెళ్లి తంతు జరిపించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Arun Chilukuri
Published on: 16 July 2026 3:46 PM IST
Viral Video
X

Viral Video: షాకింగ్.. కప్పతో ఏడడుగులు నడిచిన యువతి!

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తున్న ఒక వీడియో మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఒక యువతి ఏకంగా ఓ కప్పతో పెళ్లి తంతు ముగించేసింది.

ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు, ఆ తర్వాత జరుగుతున్న కొన్ని చేదు సంఘటనల వల్ల చాలామంది పెళ్లి అంటేనే భయపడి దూరంగా పారిపోతున్నారు. మరికొందరు పెళ్లికి ముందే ఎలాంటి జాతక దోషాలు లేకుండా చూసుకునేందుకు జ్యోతిష్య పండితులను సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక యువతి వెరైటీగా ఒక కప్పతో వివాహ క్రతువు నిర్వహించింది. అగ్నిసాక్షిగా తన కొంగును ఆ కప్ప మెడకు చుట్టి మరీ హోమగుండం చుట్టూ ఏడడుగులు వేసింది.

ఈ పెళ్లి తంతు జరుగుతున్న సమయంలో.. ఆ యువతి తనను లాగుతుంటే ఏం చేయలేక ఆ కప్ప బాధతో విలవిల్లాడిపోయింది. ఈ వింత పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, మరికొందరు మాత్రం ఈ చర్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. కేవలం సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అవ్వడం కోసమే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారా? లేక జాతకంలో ఏవైనా దోషాలు పోతాయని మూఢనమ్మకంతో చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. కారణం ఏదైనా.. నోరులేని ఒక మూగజీవిని ఇలా హింసించడం ఏంటంటూ సదరు యువతిపై నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story